Adipurush : వందల కోట్లు పెట్టి ఇతిహాసాలని ఇలా చెడగొట్టకండి.. ‘ఆదిపురుష్’పై ఫైర్ అయిన శక్తిమాన్..

తాజాగా ఆదిపురుష్ టీజర్ పై స్పందిస్తూ శక్తిమాన్ పాత్రతో ఫేమ్ అయిన బాలీవుడ్ స్టార్ నటుడు ముఖేష్ ఖన్నా సీరియస్ అయ్యారు. టీజర్ చూసి ముఖేష్ కన్నా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ''ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తీశారన్నారు. నాకైతే టీజర్ లో రాముడు, హనుమంతుడు, రావణాసురుడు కనపడలేదు. దేవుళ్ళు హాలీవుడ్ హీరో...........

Adipurush : వందల కోట్లు పెట్టి ఇతిహాసాలని ఇలా చెడగొట్టకండి.. ‘ఆదిపురుష్’పై ఫైర్ అయిన శక్తిమాన్..

Shaktimaan Mukesh Khanna fires on Adipurush Teaser

Adipurush :  ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ ఇటీవల రిలీజయింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటించారు. అయితే టీజర్ రిలీజైన దగ్గరనించి టీజర్ పై, సినిమాపై, డైరెక్టర్ పై విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి.

బొమ్మల సినిమా, గ్రాఫిక్స్ సినిమా తీశారని ఓ పక్కన అభిమానులు ట్రోల్ చేస్తుంటే మరో పక్క రామాయణం అని చెప్పి హాలీవుడ్ సినిమా తీశారేంటి అసలు అందులో రామాయణం ఎక్కడుంది అని హిందువులు మండిపడుతున్నారు. హిందూ మాత విశ్వసాలతో మరోసారి బాలీవుడ్ ఆడుకుంటుంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ టీజర్ పై విమర్శలు వ్యక్తం చేస్తూ పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.

Satya Dev : సత్యదేవ్ ఆన్ ఫైర్.. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్.. చిరంజీవి అంతలా పొగడటంలో తప్పులేదు..

తాజాగా ఆదిపురుష్ టీజర్ పై స్పందిస్తూ శక్తిమాన్ పాత్రతో ఫేమ్ అయిన బాలీవుడ్ స్టార్ నటుడు ముఖేష్ ఖన్నా సీరియస్ అయ్యారు. టీజర్ చూసి ముఖేష్ కన్నా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ”ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తీశారన్నారు. నాకైతే టీజర్ లో రాముడు, హనుమంతుడు, రావణాసురుడు కనపడలేదు. దేవుళ్ళు హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్‌ ష్వాజ్‌నెగ్గర్‌లా ఉండరు. సున్నితంగా, విధేయతతో ఉంటారు.”

”ఆదిపురుష్ అని పేరు పెట్టినప్పుడు ఇది రాతియుగం స్టోరీ అని చెప్పాల్సింది. రామాయణం అని చెప్పకండి. రామాయణం కథ తీయాలి అనుకుంటే ఆహార్యం, పాత్రలు అలా ఉండవు. వందల కోట్లు ఖర్చుపెట్టి ఇతిహాసాలని ఇలా చెడగొట్టకండి. హాలీవుడ్ సినిమాలని ఆదర్శంగా తీసుకొని రామాయణం తెరకెక్కిస్తానంటే కుదరదు. రామాయణాన్ని ఇష్టమొచ్చినట్టు మారిస్తే ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వడం కాదు, వారి ఆగ్రహానికి కూడా గురికావాల్సి వస్తుంది. ఇదొక ఫిక్షనల్ స్టోరీ అని చెప్పండి, రామాయణం అని మాత్రం చెప్పకండి, ఇతర మతాలతో ఇలా చేయగలరా” అని ఫైర్ అయ్యారు.