Indian 2 : భారతీయుడు వచ్చేస్తున్నాడు.. కమల్ పుట్టినరోజు కంటే ముందే ఫ్యాన్స్‌కి గిఫ్ట్..

కమల్ పుట్టినరోజు కంటే ముందే ఫ్యాన్స్‌కి గిఫ్ట్ ప్లాన్ చేసిన శంకర్. భారతీయుడు వచ్చేస్తున్నాడు.

Indian 2 : భారతీయుడు వచ్చేస్తున్నాడు.. కమల్ పుట్టినరోజు కంటే ముందే ఫ్యాన్స్‌కి గిఫ్ట్..

shankar gave update on Kamal Haasan Indian 2 movie

Updated On : October 29, 2023 / 5:46 PM IST

Indian 2 : కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా ‘ఇండియన్ 2’. ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం అనేక ఇబ్బందులు దాటుకొని ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కమల్ హాసన్ తన డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసేశారు. ఇక ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభిమానులకు శంకర్ గుడ్ న్యూస్ చెప్పాడు.

నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ఆ బర్త్ డే కంటే ముందే అభిమానులకు శంకర్ ఒక గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేశాడు. నవంబర్ 3 నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నారు. ఆ రోజు భారతీయుడు ఇంట్రో గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఇప్పటివరకు సమాచారం లేదు. ఆ గ్లింప్స్ తో పాటు సినిమా విడుదల తేదీ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి భారతీయుడు ఎటాక్ బాక్స్ ఆఫీస్ పై ఎప్పుడు ఉంటుందో చూడాలి.

Also read : OG Movie : అప్పుడు చిరంజీవితో.. ఇప్పుడు పవన్‌తో.. OGలో ఆ హీరో ముఖ్య పాత్ర..

పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విడుదల తేదీ గురించి రామ్ చరణ్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. శంకర్ ఇండియన్ 2 తో పాటు గేమ్ ఛేంజర్ సినిమాని కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ 2 చిత్రం తరువాత గేమ్ ఛేంజర్ రిలీజ్ ఉంటుందని సమాచారం. దీంతో ఇండియన్ 2 ఎంత త్వరగా రిలీజ్ అయితే.. గేమ్ ఛేంజర్ ని అంత త్వరగా చూడొచ్చని చరణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా ఇండియన్ జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.