Balakrishna: బాలయ్య అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా ఆ బాలీవుడ్ బ్యూటీ..

మాస్ అండ్ కామెడీ చిత్రాలు తెరకెక్కించే అనిల్ రావిపూడి, గాడ్ అఫ్ మాస్స్‌స్ బాలకృష్ణతో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు “రామారావు గారు” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది. అదేంటంటే ఈ మూవీలో బాలయ్య సరసన నటించేందుకు..

Balakrishna: బాలయ్య అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా ఆ బాలీవుడ్ బ్యూటీ..

Sonakshi Sinha as female lead in Balayya Anil Ravipudi Movie

Balakrishna: మాస్ అండ్ కామెడీ చిత్రాలు తెరకెక్కించే అనిల్ రావిపూడి, గాడ్ అఫ్ మాస్స్‌స్ బాలకృష్ణతో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. బాలయ్య 108వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది నుంచి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు “రామారావు గారు” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.

Balakrishna : అన్‌స్టాపబుల్.. ఇక్కడ పెళ్లిళ్లు చేయబడును..

తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది. అదేంటంటే ఈ మూవీలో బాలయ్య సరసన నటించేందుకు దబాంగ్ బ్యూటీ ‘సోనాక్షి సిన్హా’ని తీసుకోబోతున్నారట. మేకర్స్ మొదట రకుల్ ప్రీత్‌ను కూడా సంప్రదించినప్పటికీ, ఆమె డేట్స్ అందుబాటులో లేకపోవడంతో మూవీ టీం ఈ బబ్లీ హీరోయిన్ ని సంప్రదించారట. అయితే ఈ వార్తలో నిజమెంత ఉన్నదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

కాగా ఈ సినిమాలో బాలయ్య కుమార్తెగా శ్రీలీల మరియు కీలక పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమా పూర్తీ చేసే పనిలో ఉన్నాడు. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.