Empire Magazine : RRRకి మరో గుర్తింపు.. వరల్డ్ ఫేమస్ సినిమా మ్యాగజైన్ లో RRR సినిమా గురించి..
వరల్డ్ ఫేమస్ సినిమా మ్యాగజైన్ ఎంపైర్ మ్యాగజైన్ రాజమౌళిని ఇంటర్వ్యూ చేసి వారి మ్యాగజైన్ లో RRR గురించి స్పెషల్ ఆర్టికల్ రాశారు. ఎంపైర్ మ్యాగజైన్ లో.............

Special article on RRR Movie in World Famous Magazine Empire Magazine
Empire Magazine : చరణ్, తారక్ లు హీరోలుగా మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన టాలీవుడ్ సినిమా RRR ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు దేశ విదేశాల్లో RRR సినిమా పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచం నలుమూలలా RRR సినిమాని అందరూ అభినందిస్తున్నారు. అన్నివైపులా RRR సినిమాకి గుర్తింపు లభిస్తుంది.
హాలీవుడ్ లో పలు ఫిలిం ఫెస్టివల్స్ లో RRR సినిమాని ప్రదర్శించారు. ఇటీవలే ఈ సినిమాకి హాలీవుడ్ కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు సాధించింది. తాజాగా RRR సినిమాకి మరో గుర్తింపు లభించింది.
వరల్డ్ ఫేమస్ సినిమా మ్యాగజైన్ ఎంపైర్ మ్యాగజైన్ రాజమౌళిని ఇంటర్వ్యూ చేసి వారి మ్యాగజైన్ లో RRR గురించి స్పెషల్ ఆర్టికల్ రాశారు. ఎంపైర్ మ్యాగజైన్ లో RRR సినిమా గురించి, రాజమౌళి డైరెక్షన్ గురించి గొప్పగా రాశారు. దీనిపై రాజమౌళి ఆ మ్యాగజైన్ తో స్పందిస్తూ.. RRR సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఇంత గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంత ప్రఖ్యాత మ్యాగజైన్ లో మా సినిమా గురించి రాయడం ఆనందంగా ఉంది అని తెలిపారు.
EXCLUSIVE: #RRR director @ssrajamouli says the reason for the Indian epic's worldwide success is "its unapologetic heroism".
READ MORE: https://t.co/02JSwxD7Gx pic.twitter.com/nBTqh6G9hq
— Empire Magazine (@empiremagazine) October 25, 2022