Faria Abdullah : ఐదేళ్లలో పాన్ వరల్డ్ హీరోయిన్.. పదేళ్లలో డైరెక్షన్.. చిట్టికి కోరికలు చాలానే ఉన్నాయిగా..

తాజాగా ఫరియా అబ్దుల్లా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాల పరంగా తనకున్న కోరికలని తెలిపింది. ఫరియా మాట్లాడుతూ.............

Faria Abdullah : ఐదేళ్లలో పాన్ వరల్డ్ హీరోయిన్.. పదేళ్లలో డైరెక్షన్.. చిట్టికి కోరికలు చాలానే ఉన్నాయిగా..

Faria Abdullah want to do direction

Updated On : October 29, 2022 / 8:24 AM IST

Faria Abdullah :  జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా బాగా పాపులర్ అయిపోయి ఓవర్ నైట్ స్టార్ అయింది ఫరియా అబ్దుల్లా. ఆ సినిమాతో మరీ ఎక్కువగా కాకపోయినా కొన్ని అవకాశాలు మాత్రం వచ్చాయి. ప్రస్తుతం ఫరియా సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ గా నటించిన లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా నవంబర్ 4న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు.

Chiranjeevi : ఇక్కడ ఆయన లేరుగా.. ఇండైరెక్ట్ గా గరికపాటికి కౌంటర్ ఇచ్చిన మెగాస్టార్..

తాజాగా ఫరియా అబ్దుల్లా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాల పరంగా తనకున్న కోరికలని తెలిపింది. ఫరియా మాట్లాడుతూ.. ”జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాత్ర అందరికి నచ్చింది. ఆ పేరు చాలామందికి ఒక ఎమోషన్ లా మారింది. నటన విషయంలో నేను పరిమితులు పెట్టుకోలేదు. యాక్షన్‌, సూపర్‌ నేచురల్‌, సైకో థ్రిల్లర్స్‌.. ఇలా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. ఐదేళ్లలో పాన్‌ వరల్డ్‌ హీరోయిన్ గా ఎదగాలని కోరుకుంటున్నాను. దర్శకత్వం కూడా చేయాలని ఉంది. ఓ పదేళ్ల తర్వాత డైరెక్షన్ చేస్తాను” అని తెలిపింది. దీంతో సినిమాల పరంగా చిట్టికి చాలానే కోరికలు ఉన్నాయని అర్ధమవుతుంది.