బీజేపీలోకి ఖుష్బూ.. కాంగ్రెస్‌కు గుడ్ బై

బీజేపీలోకి ఖుష్బూ.. కాంగ్రెస్‌కు గుడ్ బై

పాపులర్ దక్షిణాధి నటి.. సీనియర్‌ నటి Khushbu 2014 నుంచి ఆరేళ్ల పాటు కాంగ్రెస్‌తో ప్రయాణం చేసి గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయ్యారు. ఈ వార్తలపై ఆమె కామెంట్ ఏదీ చేయకున్నా.. ఢిల్లీకి బయల్దేరినట్లు తెలుస్తోంది. సోమవారం ఆమె బీజేపీలో చేరనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ అదే నిజమైతే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు ఆమెకు మంచి అవకాశమే దక్కుతుంది. గతంలో అంటే 2010లో అధికార పార్టీ డీఎంకేలో చేరారు. ‘నేను సరైన నిర్ణయమే తీసుకున్నా అనుకుంటున్నాను. నాకు ప్రజలకు సేవ చేయడమంటే ఇష్టం. మహిళల అభ్యున్నతికి పాటుపడాలని అనుకుంటున్నాను’ అని చెప్పారు.



నాలుగేళ్ల తర్వాత ఆ పార్టీని వదిలేస్తూ.. ‘డీఎంకే కోసం కష్టపడటమనేది ఒక వైపు నుంచే ఉంటోంది’ అని కామెంట్ చేశారు. 2014లో సోనియా గాంధీని కలిసి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ‘నేను ఫైనల్ గా సొంత పార్టీకి చేరినట్లుగా ఉంది. దేశాన్ని ఐక్యంగా చూడటంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మంచి చేస్తుందని భావిస్తున్నాను’ అని కామెంట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికారిక ప్రతినిధిగా పనిచేశారు. ఇటీవలే కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యాపాలసీని సమర్ధించారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఖుష్బూపై సీరియస్ అయ్యింది. అప్పటి నుంచి ఆమె కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉన్నారు. ఖుష్బూ రాకతో తమిళనాడు బీజేపీకి కొత్త గ్లామర్ చేరనుంది.

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఖుష్బూ చేరికతో బీజేపీకి కొంతమేర అదనపు బలం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడులో విశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్న ఖుష్బూ పేరిట ఓ గుడి కూడా ఉంది.