Telugu Serials : తెలుగు బుల్లితెరపై కన్నడ నటీనటుల బ్యాన్..?

రెండు రోజుల క్రితం బుల్లితెర హీరో, నటుడు చందన్ కుమార్ సీరియల్ షూటింగ్ లో సీరియల్ కి పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ని బూతులు తిడుతూ హంగామా చేశాడు. దీంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కారణం లేకుండానే బూతులు తిట్టాడని, నా తల్లిని దూషించాడని అతనితో..........

Telugu Serials : తెలుగు బుల్లితెరపై కన్నడ నటీనటుల బ్యాన్..?

Kannada Actors : రెండు రోజుల క్రితం బుల్లితెర హీరో, నటుడు చందన్ కుమార్ సీరియల్ షూటింగ్ లో సీరియల్ కి పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ని బూతులు తిడుతూ హంగామా చేశాడు. దీంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కారణం లేకుండానే బూతులు తిట్టాడని, నా తల్లిని దూషించాడని అతనితో వాదనకి దిగాడు. ఈ క్రమంలో అక్కడ పని చేస్తున్న వారంతా హీరోపై సీరియస్ అయ్యారు. అతనిని క్షమాపణ చెప్పమనడంతో చందన్ కుమార్ నేనేంటో చూపిస్తా అంటూ సీరియస్ అయ్యాడు. దీంతో ఆగ్రహించిన అసిస్టెంట్ డైరెక్టర్ చందన్ కుమార్ ని అందరి ముందే కొట్టాడు.

సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ తో తెలుగులో గుర్తింపు పొందిన కన్నడ నటుడు చందన్‌ కుమార్‌ ప్రస్తుతం తెలుగులో ‘శ్రీమతి శ్రీనివాస్‌’ సీరియల్లో లీడ్‌ రోల్‌ చేస్తున్నాడు. కన్నడలో బాగా ఫేమస్ ఉన్న చందన్ తెలుగులో ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్నాడు. అయితే ఈ గొడవలో చుట్టూ ఉన్న వాళ్ళు ఆపడానికి ప్రయత్నించారు. హీరోపై సీరియల్ టీం అంతా సీరియస్ అయ్యారు. చందన్ షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు. అయితే అక్కడితో గొడవ ముగిసింది అనుకుంటే చందం కన్నడ మీడియా ముందు తెలుగు పరిశ్రమపై అసత్యాలు ప్రచారం చేస్తూ, తెలుగు బుల్లితెరని కించపరుస్తూ మాట్లాడాడు.

Tiger Nageshwar Rao: రవితేజ మూవీలో బాలీవుడ్ నటుడు.. ఎవరంటే?

దీంతో ఈ ఇష్యూ పెద్దదిగా మారింది. మన తెలుగు సీరియల్స్ లో చాలా మంది కన్నడ నటీనటులు నటిస్తున్నారు. చందన్ కుమార్ చేసిన పనికి కన్నడ నటీనటుల మీద బ్యాన్ చేయాలి అనే వాదన వినిపిస్తున్నది. దీనిపై టీవీ ఫెడరేషన్ నేడు సాయంత్రం ఫిలిం ఛాంబర్ లో సమావేశం కానుంది. దీనిపై ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. కన్నడ రంగం నుండి వచ్చిన ఒక యాక్టర్ ఇక్కడ షూటింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ ని చిన్న విషయానికే బండ బూతులు తిట్టి, కొట్టడం జరిగింది. అంతేకాక కన్నడ మీడియాలో ఆ నటుడు తెలుగు టీవీ రంగంపై అసత్య ఆరోపణలు చేస్తూ, మనవారిని అవమాన పరిచే విధంగా మాట్లాడాడు. వీటిని ఖండిస్తూ, వాస్తవాలు తెలిపేందుకు దీనిని దర్శకుల సంఘంతో పాటు, టీవీ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఆ కన్నడ నటుడిని బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకోబోతోంది అని ఫెడరేషన్ సభ్యులు వివరించారు. అంతేకాక తెలుగులో కన్నడ నటినటులు ఎక్కువయ్యారు, వాళ్ళే డామినేట్ చేస్తున్నారు, కన్నడ నటీనటులను బ్యాన్ చేసే దానిపై కూడా ఆలోచిస్తారని సమాచారం.