Rajinikanth: రజినీకాంత్ సినిమాకు ఆ డైరెక్టర్‌ను కాదని బాబీని ఓకే చేశారా..?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. రజినీకాంత్ కెరీర్‌లో 171వ సినిమాను బాబీ డైరెక్ట్ చేయనున్నాడని నెట్టింట వార్తలు జోరందుకున్నాయి.

Rajinikanth: రజినీకాంత్ సినిమాకు ఆ డైరెక్టర్‌ను కాదని బాబీని ఓకే చేశారా..?

This Director Was Replaced By Bobby For Rajinikanth Movie

Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, రజినీ తన నెక్ట్స్ మూవీని ఓకే చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు బాబీ, రజినీకాంత్‌ను డైరెక్ట్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Rajinikanth : మెగాస్టార్ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ సినిమా.. నిజమేనా?

అయితే, రజినీకాంత్ కెరీర్‌లో 171వ సినిమాను బాబీ డైరెక్ట్ చేయనున్నాడని నెట్టింట వార్తలు జోరందుకున్నాయి. కాగా, ఈ సినిమాను తొలుత వేరొక డైరెక్టర్ చేయాల్సి ఉంది. అతడే లోకేశ్ కనగరాజ్. వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న లోకేశ్, రజినీకాంత్ 171వ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని కోలీవుడ్ వర్గాల్లో గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆయన్ను పక్కనబెట్టి ఈ సినిమాను తెరకెక్కించే ఛాన్స్ బాబీకి దక్కిందట.

Rajinikanth: రజినీకాంత్ నెక్ట్స్ ప్రాజెక్టుకు క్రేజీ డైరెక్టర్ ఫిక్స్..!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోకేశ్ చెప్పిన కథను కాదని, రజినీకాంత్ బాబీకి ఛాన్స్ ఇచ్చాడా.. లేక అదే కథకు మెరుగులు దిద్ది డైరెక్ట్ చేసే బాధ్యతలు బాబీకి అప్పగించారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి నిజంగానే లోకేశ్ స్థానంలో బాబీ డైరెక్టర్ ఛాన్స్ కొట్టేశాడా అనేది తెలియాల్సి ఉంది.