Thrigun : పెళ్లి పీటలు ఎక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరో.. రేపే వెడ్డింగ్..
ఇటీవల టాలీవుడ్‌లో యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లిపీటలు ఎక్కే ప్రయత్నాల్లో ఉన్నారు. తాజాగా మరో యంగ్ హీరో త్రిగన్ (Thrigun) పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

Thrigun Weds Nivedita
Thrigun Weds Nivedita : ఇటీవల టాలీవుడ్‌లో యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లిపీటలు ఎక్కే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరు ఒక్కటి కానున్నారు. తాజాగా మరో యంగ్ హీరో త్రిగన్ (Thrigun) పెళ్లి పీటలు ఎక్కనున్నారు. నివేదితా (Nivedita) అనే అమ్మాయిని ఆదివారం (సెప్టెంబర్ 3)రోజు పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే తెలియజేశారు.
తమిళనాడు తిరుపుర్‌లోని శ్రీ సెంతుర్ మహల్ ఇందుకు వేదిక కానుంది. బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం అంగరంగవైభవంగా జరగనుంది. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వీరి వివాహానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహామే. ఈ క్రమంలో పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. కాబోయే దంపతుల ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Thrigun Weds Nivedita
Silvina Luna : ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో మరణించిన ప్రముఖ నటి..
‘కథ’ అనే సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు త్రిగుణ్ అలియాస్ అరుణ్ అదిత్. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు సినిమాల్లో నటించారు. ‘వీకెండ్ లవ్’, ‘తుంగభద్ర’, ‘మనసుకు నచ్చింది’, ’24 కిస్సెస్’, ‘పీఎస్వీ గరుడ వేగ’, ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’, ‘డియర్ మేఘ’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గతేడాది ‘కథ కంచికి మనం ఇంటికి’, రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.