Trivikram Mahesh Babu Movie: అలా ఆ టీమ్‌ను మళ్లీ వాడుతున్న త్రివిక్రమ్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తుండటంతో ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తన రీసెంట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’కు పనిచేసిన టీమ్‌ను మరోసారి వినియోగించుకునేందుకు రెడీ అయ్యారట.

Trivikram Mahesh Babu Movie: అలా ఆ టీమ్‌ను మళ్లీ వాడుతున్న త్రివిక్రమ్..?

Trivikram Mahesh Babu Movie To Have Ala Vaikuntapuramuloo Team

Trivikram Mahesh Babu Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తుండటంతో ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

SSMB28 Shooting: మొదలెట్టేందుకు సిద్ధం అంటోన్న మహేష్.. ఎప్పుడంటే?

ఇక ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఓ అదిరిపోయే కథను రెడీ చేశాడట. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ యంగ్ రైటర్స్ గ్రూప్‌ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేగాక, ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తన రీసెంట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’కు పనిచేసిన టీమ్‌ను మరోసారి వినియోగించుకునేందుకు రెడీ అయ్యారట. పిఎస్.వినోద్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.

SSMB28: మహేష్ మూవీలో మలయాళ నటుడు.. ఎవరంటే..?

సోమవారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు త్రివిక్రమ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేస్తారని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తొలుత మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడని.. ఆ తరువాత ఈ చిత్ర హీరోయిన్ పూజా హెగ్డే షూటింగ్‌లో జాయిన్ కానుందని తెలుస్తోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించనుంది.