Urvasivo Rakshasivo: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ!

మెగా హీరో అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్చేస్తుండగా, ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

Urvasivo Rakshasivo: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ!

Urvasivo Rakshasivo Completes Censor Works

Urvasivo Rakshasivo: మెగా హీరో అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుండగా, నిన్న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు చీఫ్ గెస్టుగా నందమూరి బాలకృష్ణ హాజరై, సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరారు.

Urvasivo Rakshasivo Trailer : ఇన్ని EMIలు ఉన్నోడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదు.. ఊర్వశివో రాక్షసివో ట్రైలర్ రిలీజ్..

ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్ బాగుందని, ప్రేక్షకులు ఈ తరహా సినిమాలకు మంచి ఆదరణను అందిస్తారని సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో అల్లు శిరీష్ మరోసారి తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Urvasivo Rakshasivo: అల్లు వారి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి నరసింహ.. ఊర్వశివో రాక్షసివో!

కాగా, ఈ సినిమాలో అందాల భామ అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాను రాకేష్ శశి డైరెక్ట్ చేస్తున్నాడు. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అల్లు శిరీష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.