Vijay : చిరంజీవి ఇంద్ర వీణ స్టెప్ కాపీ కొట్టిన తమిళ్ హీరో విజయ్.. ఈ సాంగ్ చూశారా?

మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చేసిన ఇంద్ర(Indra) సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో దాయి దాయి దామ్మా సాంగ్ లో వచ్చే వీణ స్టెప్ కూడా బాగా పాపులర్ అయింది.

Vijay : చిరంజీవి ఇంద్ర వీణ స్టెప్ కాపీ కొట్టిన తమిళ్ హీరో విజయ్.. ఈ సాంగ్ చూశారా?

Vijay Copy Chiranjeevi Indra Movie Veena Step in his Movie Songs

Vijay :  ఒక భాషలో సినిమాని ఇంకో భాషలో రీమేక్ చేయడం ఎప్పట్నుంచో ఉన్నదే. గతంలో మన తెలుగు సినిమాలు తమిళ్ లో, తమిళ్ సినిమాలు తెలుగులో ఎక్కువగా రీమేక్ అయ్యేవి. సినిమాలతో పాటు సాంగ్స్, మ్యూజిక్ కూడా గతంలో చాలానే రీమేక్ చేయడం లేదా కాపీ కొట్టడం చేసేవాళ్ళు. తమిళ్ స్టార్ హీరో విజయ్ అయితే అతని కెరీర్ లో దాదాపు సగం సినిమాలు తెలుగు రీమేక్ లే.

విజయ్ సినిమాలే కాదు.. అందులో సాంగ్స్, డ్యాన్సులు, పాటలు కూడా రీమేక్ చేసేవాళ్ళు. మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చేసిన ఇంద్ర(Indra) సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో దాయి దాయి దామ్మా సాంగ్ లో వచ్చే వీణ స్టెప్ కూడా బాగా పాపులర్ అయింది. ఎక్కడ చూసినా కొన్నాళ్ల వరకు అంతా ఆ వీణ స్టెప్ వేసేవారు. అయితే ఆ వీణ స్టెప్ కూడా తమిళ్ హీరో విజయ్ ఓ సినిమాలో కాపీ కొట్టారు.

ఇంద్ర సినిమా 2002లో రాగా విజయ్ 2003లో తిరుమలై అనే ఒక సినిమాతో వచ్చారు. ఈ సినిమాలో జ్యోతిక హీరోయిన్ గా నటించింది. తిరుమలై సినిమాలో తంతకా ధీంతక.. అనే ఓ సాంగ్ ఉంది. ఈ పాటలో విజయ్ చిరంజీవి వేసిన వీణ స్టెప్ వేస్తాడు. పాట మొత్తం డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ కూడా ఉంటాడు. లారెన్స్ కూడా విజయ్ తో కలిసి వీణ స్టెప్ వేస్తాడు. అయితే ఇంద్ర సినిమాలో చిరంజీవితో వీణ స్టెప్ వేయించింది కూడా లారెన్సే.

Also Read : Rajinikanth : అదిరిపోయిన రజినీకాంత్ న్యూ లుక్.. 72 ఏళ్ళ వయసులో తలైవర్ 170 కోసం..

అయితే ఇప్పుడు విజయ్ వీణ స్టెప్ వైరల్ అవుతుండటంత బాస్ చేస్తే స్టెప్ లో గ్రేస్ ఉంటుంది. విజయ్ ఏదో డ్యాన్స్ వేయాలని వేసాడు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక మెగా అభిమానులు అయితే ఇంత మంచి స్టెప్ ని ఎందుకు కాపీ చేశారు అని ఫైర్ అవుతున్నారు. ఇదే పాటలో వీణ స్టెప్ ని రకరకాలుగా మార్చి కూడా వేయడం గమనార్హం.