Vijay Devarakonda : అప్పుడు ప్రేక్షకులు నన్ను మర్చిపోవాలని కోరుకుంటాను.. గుర్తుపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు..

తాజాగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండని ఓ విలేఖరి.. నటుడిగా కెరీర్‌ చివరి దశలో ఉంటే ప్రేక్షకులు మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారు అని అడిగాడు. దీనికి విజయ్ దేవరకొండ సమాధానమిస్తూ............

Vijay Devarakonda : అప్పుడు ప్రేక్షకులు నన్ను మర్చిపోవాలని కోరుకుంటాను.. గుర్తుపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు..

vijay devarakonda

Updated On : August 20, 2022 / 6:31 AM IST

Vijay Devarakonda :  విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ ఇండియా అంతా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వీటిల్లో సినిమా గురించి, తమ రియల్ లైఫ్స్ గురించి పలు ఆసక్తికర విషయాలని తెలియచేస్తున్నారు.

Chiranjeevi Hospital : మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు.. సినీ కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మాణం

తాజాగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండని ఓ విలేఖరి.. నటుడిగా కెరీర్‌ చివరి దశలో ఉంటే ప్రేక్షకులు మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారు అని అడిగాడు. దీనికి విజయ్ దేవరకొండ సమాధానమిస్తూ.. ”నా కెరీర్‌ ముగింపు దశకు వస్తే నన్నెవరూ గుర్తుపెట్టుకోవాలని నేను అనుకోవట్లేదు. ఆ టైంలో ప్రేక్షకులు నన్ను మర్చిపోవాలని కోరుకుంటాను. దయచేసి నా కెరీర్ చివరి దశలో ఉంటే మీ అందరూ నన్ను మర్చిపోండి. మీ జీవితాన్ని ఎంజాయ్‌ చేయండి” అని చెప్పాడు. దీంతో విజయ్ చేసిన వ్యాఖ్యలు కొత్తగా, ఆసక్తికరంగా ఉండటంతో వైరల్ గా మారాయి.