Vikram : మా ఆవిడకే టికెట్లు దొరకలేదు.. తమిళనాడులో కంప్లీట్ సేల్ అయిన కోబ్రా అడ్వాన్స్ బుకింగ్స్..

ఇప్పటికే కోబ్రా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. విక్రమ్ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి దాదాపు నాలుగు సంవత్సరాలు కావడంతో తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం సేల్ అయిపోయాయి. తమిళనాడులోని................

Vikram : మా ఆవిడకే టికెట్లు దొరకలేదు.. తమిళనాడులో కంప్లీట్ సేల్ అయిన కోబ్రా అడ్వాన్స్ బుకింగ్స్..

Vikram cobra movie advance bookings all sold in tamilanadu

Vikram :  విక్రమ్, శ్రీనిధి శెట్టి జంటగా అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన కోబ్రా సినిమా ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకి రానుంది. కొత్త రకం కథతో, విక్రమ్ 9 గెటప్స్ తో ఈ సినిమా రానుండటంతో అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినిమాపై భారీ అంచానాలే ఉన్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ వరుస ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో విక్రమ్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

Vaishali Balsara : ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి.. కారులో మృతుదేహం..

ఇప్పటికే కోబ్రా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. విక్రమ్ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి దాదాపు నాలుగు సంవత్సరాలు కావడంతో తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం సేల్ అయిపోయాయి. తమిళనాడులోని పెద్ద సిటీలలో రిలీజ్ రోజు ఒక్క టికెట్ కూడా దొరకడం లేదంట. నాలుగేళ్ళ తర్వాత విక్రమ్ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. దీనిపై విక్రమ్ తాజా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ”కోబ్రా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని అయిపోయాయి అంట. మా ఆవిడ ఫోన్ చేసి టికెట్లు దొరకట్లేదని చెప్తుంది. ఇంతటి ఎనర్జీని చూసి చాలా రోజులైంది” అని తెలిపారు. ఈ రేంజ్ బుకింగ్స్ ఉంటే సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు.