Ghulam Nabi Azad: గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా 50 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గతవారం క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విధితమే. ఆయనకు మద్దతు తెలుపుతూ పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ కు చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీనేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Ghulam Nabi Azad: గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా 50 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా..

Ghulam Nabi Azad

Ghulam Nabi Azad:  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గతవారం క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విధితమే. కాంగ్రెస్ పార్టీతో తనకున్న ఐదు దశాబ్దాల అనుబంధాన్ని వీడాడు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఐదు పేజీల లేఖను రాశారు. ఈ లేఖలో సోనియా కుమారుడు, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆజాద్ కాంగ్రెస్ ను వీడటం ఆ పార్టీకి గట్టిదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆజాద్ రాజీనామా చేసిన నాటి నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు మద్దతు తెలుపుతు కాంగ్రెస్ ను వీడుతున్నారు.

Ghulam Nabi Azad: రాహుల్ గాంధీ మంచివ్యక్తే.. కానీ, రాజకీయాల్లో కొనసాగే యోగ్యత లేదు: గులాం నబీ ఆజాద్

గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్‌తో సహా 50 మందికిపైగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. చంద్ తో పాటు మాజీ మంత్రులు అబ్దుల్ మజిద్ వానీ, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్‌లతో సహా పలువురు ఇతర పార్టీల ప్రాథమిక సభ్యత్వంతో సహా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఆజాద్‌కు మద్దతుగా మేము కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఉమ్మడి రాజీనామా లేఖను సమర్పించామని బల్వాన్ సింగ్ చెప్పినట్లు PTI వార్తా సంస్థ పేర్కొంది.

Ghulam Nabi Azad resigns: కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన గులాం నబీ ఆజాద్.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా.. రాహుల్‌పై తీవ్ర విమర్శలు

ఇదిలాఉంటే త్వరలో జమ్మూ కాశ్మీర్ నుంచి జాతీయ స్థాయి పార్టీని ఆజాద్ ప్రారంభిస్తారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆజాద్ ఖండించలేదు. త్వరలోనే కొత్త పార్టీ వస్తుందంటూ ఆజాద్ మద్దతు దారులు పలువురు ఇప్పటికే పేర్కొన్నారు. ఇదిలాఉంటే జమ్మూకాశ్మీర్ లో కార్పొరేట‌ర్లు, జిల్లా, బ్లాక్ లెవ‌ల్ నేత‌లు పలువురు ఇప్ప‌టికే కాంగ్రెస్‌ను వీడి ఆజాద్‌కు మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీ వ‌ల్లే కాంగ్రెస్ పార్టీ నాశ‌న‌మైన‌ట్లు ఆజాద్ ఆరోపించిన విష‌యం తెలిసిందే.