Ghulam Nabi Azad: రాహుల్ గాంధీ మంచివ్యక్తే.. కానీ, రాజకీయాల్లో కొనసాగే యోగ్యత లేదు: గులాం నబీ ఆజాద్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంచివ్యక్తే కానీ, రాజకీయాల్లో కొనసాగే యోగ్యత మాత్రం ఆయనకు లేదని ఆ పార్టీ మాజీ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇవాళ గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ... ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ సలహాలు తీసుకుని, పార్టీని నడిపించే పద్ధతిని బాగా నమ్మారని, కానీ, ఆ పద్ధతి రాహుల్ గాంధీ నాశనం చేశారని ఆయన అన్నారు. గతంలో సోనియా గాంధీ కాంగ్రెస్ సీనియర్ నేతల సలహాలను తీసుకుని అమలు చేసేవారని చెప్పారు.

Ghulam Nabi Azad: రాహుల్ గాంధీ మంచివ్యక్తే.. కానీ, రాజకీయాల్లో కొనసాగే యోగ్యత లేదు: గులాం నబీ ఆజాద్

Ghulam Nabi Azad

Ghulam Nabi Azad: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంచివ్యక్తే కానీ, రాజకీయాల్లో కొనసాగే యోగ్యత మాత్రం ఆయనకు లేదని ఆ పార్టీ మాజీ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇవాళ గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ… ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ సలహాలు తీసుకుని, పార్టీని నడిపించే పద్ధతిని బాగా నమ్మారని, కానీ, ఆ పద్ధతి రాహుల్ గాంధీ నాశనం చేశారని ఆయన అన్నారు. గతంలో సోనియా గాంధీ కాంగ్రెస్ సీనియర్ నేతల సలహాలను తీసుకుని అమలు చేసేవారని చెప్పారు.

రాహుల్ గాంధీకి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సోనియా గాంధీ ఇప్పుడు భావిస్తున్నారని ఆజాద్ అన్నారు. తాను బలవంతంగా పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పారు. జీ-23 నేతలు సోనియా గాంధీకి లేఖ రాసినప్పటి నుంచి ఆ పార్టీకి తానంటే నచ్చడం లేదని గులాం నబీ ఆజాద్ చెప్పారు. ఎవరైనా ప్రశ్నిస్తే కాంగ్రెస్ అధిష్ఠానానికి నచ్చదని అన్నారు. పలు సార్లు కాంగ్రెస్ సమావేశాలు జరిగాయని, అయితే ఒక్క సలహాను కూడా అధిష్ఠానం తీసుకోలేదని చెప్పారు.

తాను బీజేపీలో చేరబోనని, ఆ పార్టీలో చేరితే జమ్మూకశ్మీర్ లో తన రాజకీయ భవిష్యత్తుకు ఏమీ ఉపయోగం ఉండబోదని చెప్పారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అర్థవంతంగా లేదని చెప్పారు.

India Covid-19 cases: దేశంలో 8 వేల దిగువకు వచ్చిన కరోనా కొత్త కేసులు