NOTA: 5 ఏళ్లలో 1.29 కోట్ల ఓట్లు

2020లో జరిగి బిహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నోటా ఎక్కువ ఓట్ల శాతాన్ని సాధించింది. ఈ ఎన్నికల్లో 1.46 శాతం ఓట్లు (బిహర్‭లో 7,49,360 ఓట్లు.. ఢిల్లీలో 43,108 ఓట్లు) వచ్చాయి.2022లో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు అతి తక్కువగా 0.70 శాతం ఓట్లు (8,15,430) మాత్రమే వచ్చాయి. గోవా (10,629), మణిపూర్ (10,349), పంజాబ్ (1,10,308), ఉత్తరప్రదేశ్ (6,37,304), ఉత్తరాఖండ్ (46,840) ఓట్లు వచ్చాయి

NOTA: 5 ఏళ్లలో 1.29 కోట్ల ఓట్లు

NOTA: గడిచిన ఐదేళ్లలో లోక్‭సభ, అసెంబ్లీ ఎన్నికల్లో 1.29 కోట్ల ఓట్లు నోటాకు పడ్డాయని ది అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) గురువారం వెల్లడించింది. నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఈడబ్లూ)తో కలిసి 2018 నుంచి 2022 వరకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లను విశ్లేషించి ఈ డేటాను వెల్లడించారు. ఈ విశ్లేషణ ప్రకారం.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 64,53,652 ఓట్లు నోటాకు పడ్డాయట. మొత్తంగా ఈ ఎన్నికల్లో నోటా శాతం 1.06 శాతం. లోక్‭సభ ఎన్నికల విషయానికి వస్తే బిహర్‭లోని గోపాల్‭గంజ్ నియోజకవర్గంలో నోటాకు అతి ఎక్కువగా 51,660 ఓట్లు పడ్డాయి. ఇక అతి తక్కువగా లక్షద్వీప్ నియోజకవర్గంలో 100 ఓట్లు మాత్రమే వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే మహారాష్ట్రలోని లాతూర్ రూరల్ నియోజకవర్గంలో అతి ఎక్కువగా 27,500 ఓట్లు పడ్డాయి. అతి తక్కువగా అరుణాచల్ ప్రదేశ్‭లోని తలి అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం తొమ్మిది మాత్రమే పడ్డాయి.

2020లో జరిగి బిహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నోటా ఎక్కువ ఓట్ల శాతాన్ని సాధించింది. ఈ ఎన్నికల్లో 1.46 శాతం ఓట్లు (బిహర్‭లో 7,49,360 ఓట్లు.. ఢిల్లీలో 43,108 ఓట్లు) వచ్చాయి.2022లో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు అతి తక్కువగా 0.70 శాతం ఓట్లు (8,15,430) మాత్రమే వచ్చాయి. గోవా (10,629), మణిపూర్ (10,349), పంజాబ్ (1,10,308), ఉత్తరప్రదేశ్ (6,37,304), ఉత్తరాఖండ్ (46,840) ఓట్లు వచ్చాయి. ఇక నోటాకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతి ఎక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చాయి. 2019లో జరిగిన ఈ ఎన్నికల్లో 7,42,134 ఓట్లు నోటాకు పడ్డాయి. అతి తక్కువగా 2018లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో 2,917 ఓట్లు పడ్డాయి.

Sena vs Sena: సుప్రీంలో షిండే వర్గం యూటర్న్