Kolar: గుడి మీద నీలి జెండా ఎగరేసిన అంబేద్కరిస్టులు.. దళిత కుటుంబానికి రూ.60 వేలు ఫైన్ వేయడంపై రియాక్షన్ ఇది

బాలుడి తల్లి శోభమ్మ మాట్లాడుతూ "దేవుడు మమ్మ‌ల్ని ఇష్టపడకపోతే, మేము ఆయనను ప్రార్థించము. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కి ప్రార్ధనలు చేస్తాం. మనం అంటే నచ్చని, మన ప్రార్థనలను తీసుకోని దేవుడిని ఆరాధించడం దేనికి? ఇతర వ్యక్తుల్లాగే నేను కూడా ఈ దేవుళ్లకు ఎంతో డబ్బు ఖర్చు చేశాను. విరాళాలు ఇచ్చాను. ఇకపై అలాంటి పనులు చేయను. ఈరోజు నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను మాత్రమే పూజిస్తాను"అని పేర్కొన్నారు.

Kolar: గుడి మీద నీలి జెండా ఎగరేసిన అంబేద్కరిస్టులు.. దళిత కుటుంబానికి రూ.60 వేలు ఫైన్ వేయడంపై రియాక్షన్ ఇది

ambedkarists hoisted blue flags at temple in kolar where fined 60k for touching hindu god

Kolar: హిందూ దేవుడి విగ్రహాన్ని తాకినందుకు గాను ఒక దళిత కుటుంబానికి 60,000 రూపాయల ఫైన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై అంబేద్కరిస్టు సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టాయి. సదరు దేవతా గుడికి నీలి జెండాలతో వెళ్లిన అంబేద్కరిస్టులు.. గుడిపై నీలి జెండాను ఎగరవేశారు. గుడి గోపురంపై నీలి జెండా ఎగరవేసిన ఒక వ్యక్తి.. అంబేద్కరిస్టుల సమూహాన్ని ఉద్దేశిస్తూ విజయ సంకేతాలు చేశాడు. జరిమానా విధించిన మూడు రోజుల అనంతరం జరిగిన పరిణామం ఇది.

విషయంలోకి వెళ్తే.. బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలోని కోలార్ జిల్లా మలూరు తాలూకాలోని ఉల్లెరహళ్లిలో సెప్టెంబరు 8న గ్రామస్థులు భూతాయమ్మ జాతర నిర్వహించారు. ఆనాదిగా వస్తున్న ఆచారాల ప్రకారం గ్రామదేవత ఆలయంలోకి ద‌ళితుల‌కు అక్కడ ప్రవేశం లేదు. ఇక జాతర సందర్భంగా గ్రామంలో దేవ‌త ఊరేగింపు నిర్వహించారు. కాగా, 15 ఏళ్ల ఒక కుర్రాడు గ్రామ దేవత విగ్రహానికి క‌ట్టిన స్తంభాన్ని తాకాడు. అంతే గ్రామస్తడు వెంకటేశప్ప దానిని గమనించి దారుణానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ మ‌రికొంద‌రిని పోగేశాడు. వారంతా క‌లిసి బాలుడి కుటుంబాన్ని గ్రామ పెద్దల ఎదుట హాజరుపరిచారు.


Yatra with 1000 kg Ambedkar coin: వెయ్యి కిలోల అంబేద్కర్ నాణెంతో ఢిల్లీకి యాత్ర.. అడ్డుకున్న హర్యానా పోలీసులు

దళితులు దేవతా విగ్రహం తాకడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి 60,000 రూపాయలు జరిమానా విధించారు. బాలుడి తండ్రి అనారోగ్యం కారణంగా ఏ పనీ చేయలేడు. తల్లి కూలీ పని చేసి ఇళ్లు నడుపుతోంది. ఊరికి బయట నివసించే ఈ కుటుంబం అంత చెల్లించుకోలేమని చెప్పినా వినలేదు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న అంబేద్కర్ సంఘాలు.. బాధిత కుటుంబానికి వచ్చి, ఇంట్లోని హిందూ దేవుళ్ల విగ్రహాలు తొలగించి అంబేద్కర్ ఫొటో పెట్టారు.


అనంతరం బాలుడి తల్లి శోభమ్మ మాట్లాడుతూ “దేవుడు మమ్మ‌ల్ని ఇష్టపడకపోతే, మేము ఆయనను ప్రార్థించము. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కి ప్రార్ధనలు చేస్తాం. మనం అంటే నచ్చని, మన ప్రార్థనలను తీసుకోని దేవుడిని ఆరాధించడం దేనికి? ఇతర వ్యక్తుల్లాగే నేను కూడా ఈ దేవుళ్లకు ఎంతో డబ్బు ఖర్చు చేశాను. విరాళాలు ఇచ్చాను. ఇకపై అలాంటి పనులు చేయను. ఈరోజు నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను మాత్రమే పూజిస్తాను”అని పేర్కొన్నారు.

ఇక తాజాగా దళిత కుటుంబానికి జరిమానా విధించడంపై అంబేద్కర్ సంఘాలు, అంబేద్కరిస్టులు నీలి జెండాలతో పెద్ద ర్యాలీ తీశారు. వందల సంఖ్యలో నీలి జెండాలు పట్టుకుని గుడి వరకు ర్యాలీగా వచ్చారు. ఇంతలో కొద్ది మంది గుడి పైకి ఎక్కి ఆలయ గోపురంపై నీలి జెండా ఎగరవేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Ambedkar photo in savarna attire: హిందూ సంప్రదాయ దుస్తుల్లో అంబేద్కర్.. కేరళలో తీవ్ర దుమారం