Anand Mahindra-Rishi Sunak : విన్‌స్టన్ చర్చిల్ చేసిన అవహేళనకు 75ఏళ్ల తరువాత బ్రిటీష్ వారికి రిషి సునాక్ ధీటైన సమాధానం

బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ ఎన్నికై 200ల ఏళ్లపాటు భారతీయులను ఏలిన బ్రిటీష్ దేశాలకు నాయకుడయ్యారు. చరిత్రలో గుర్తుండిపోయే ఈ సంఘటనపై భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రా ఆసక్తికరంగా ఇచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Anand Mahindra-Rishi Sunak : విన్‌స్టన్ చర్చిల్ చేసిన అవహేళనకు 75ఏళ్ల తరువాత బ్రిటీష్ వారికి రిషి సునాక్ ధీటైన సమాధానం

Anand Mahindra-Rishi Sunak :

Anand Mahindra-Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ ఎన్నికై 200ల ఏళ్లపాటు భారతీయులను ఏలిన బ్రిటీష్ దేశాలకు నాయకుడయ్యారు. చరిత్రలో గుర్తుండిపోయే ఈ సంఘటనపై భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రా ఆసక్తికరంగా ఇచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనూహ్య పరిణామాల మధ్య రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవ్వటంపై యావత్ భారత్ అంతా హర్షం వ్యక్తంచేస్తోంది. 200ఏళ్లపాటు భారతీయల్ని పాలించి బానిసలుగా అవమానించిన బ్రిటీష్ దేశాలకు మన భారతీయుడు ప్రధాని అయ్యాడంటూ పొంగిపోతున్నారు. చరిత్ర సృష్టించిన ఈ సంఘటనపై ఆనంద్ మహేంద్ర స్పందిస్తూ ఆసక్తి ట్వీట్ పెట్టారు.

బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ గతంలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. భారత వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నారో ఈ ఘటన మరోసారి ప్రత్యక్ష్య ఉదాహరణంగా కనిపిస్తోందంటూ చెప్పకనే చెబుతూ..ఆనంద్ మహేంద్రా ట్వీట్ లో ఇలా పేర్కొన్నారు. ‘‘1947లో స్వాతంత్ర్యం వేళ భారత నాయకులందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారని, వారిలో తక్కువ శక్తిసామర్థ్యాలు ఉంటాయంటూ విన్‌స్టన్ చర్చిల్ అవహేళన చేశారు. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంలో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటన్‌ పగ్గాలు చేపట్టడం ద్వారా వారికి తగిన జవాబు ఇచ్చారు. జీవితం ఎంతో అందమైంది’’ అంటూ ట్వీట్‌ చేశారు.
ఆనంద్ మహేంద్రా చేసిన ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇప్పటికే దీనిని వేలాదిగా లైక్‌ వచ్చాయి.

కాగా..బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌(Rishi Sunak) ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. దాదాపు ప్రధానిగా రిషి ఎన్నిక అవుతారు అనుకునే సమయంలో కాస్తలో మిస్ అయ్యారు. లిజ్ ట్రస్ ప్రధాని అయ్యారు. బ్రిటన్ కు తొలి మహిళా ప్రధానిగా లిజ్ చరిత్ర సృష్టించారు. కానీ ఈ లోపే అనూహ్య పరిస్థితుల మధ్య ప్రధాని లిజ్‌ ట్రస్‌(Liz truss) రాజీనామా చేశారు. దీంతో టోరీ సభ్యులు.. ఈసారి రిషి వైపే మొగ్గు చూపారు. దీంతో బ్రిటన్‌ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ శుభపరిణామంపై ఆనంద్‌ మహీంద్రా తనదైన శైలిలో చేసిన ఈ ట్వీట్‌ ఆసక్తికంగా మారింది.