Surendra Yadav : యూపీ డిప్యూటీ లోకయుక్తాగా బాబ్రీ కేసు జడ్జీ నియామకం
స్పెషల్ సీబీఐ కోర్టు మాజీ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ యూపీ రాష్ట్ర డిప్యూటీ లోకయుక్తాగా నియామకం అయ్యారు. జాన్పూర్ కు చెందిన యాదవ్.. లోకాయుక్తా జస్టిస్ (రిటైర్డ్) సంజ్ మిశ్రా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.
Babri Case Judge Appointed Up Deputy Lokayukta
Babri case judge : స్పెషల్ సీబీఐ కోర్టు మాజీ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ యూపీ రాష్ట్ర డిప్యూటీ లోకాయుక్తాగా నియామకం అయ్యారు. జాన్పూర్ కు చెందిన యాదవ్.. సీనియర్ అధికారి లోకయుక్తా జస్టిస్ (రిటైర్డ్) సంజ్ మిశ్రా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఏప్రిల్ 6న మాజీ జడ్జి నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ పై గవర్నర్ ఆనందెబన్ పటేల్ సంతకం చేశారు.
గత ఏడాది సెప్టెంబర్ 30న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో యాదవ్ తీర్పును వెలువరించారు. అదే రోజున ఆయన రిటైర్మెంట్ అయ్యారు. జాన్పూర్ నుంచి యాదవ్ ప్రాథమిక అభ్యాస్యాన్ని ప్రారంభించారు.
వారణాసి జిల్లాలో ఉన్నత చదువులు చదివారు. తన న్యాయవాది వృత్తిని చేపట్టానికి ముందు యాదవ్ లా కోర్సును పూర్తి చేశారు. కొన్ని ఏళ్ల పాటు మున్సిఫ్ గా పనిచేశారు.. అదనపు చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ (ACJM), చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్, అదనపు జిల్లా జడ్జీగా పలు జిల్లా కోర్టుల్లో పనిచేశారు.
