Israel Palestine Conflict: గాజాకు మద్దతిస్తాం, వాళ్లేమడిగినా ఇస్తాం.. బెంగాల్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదు. యుద్ధం ద్వారా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు. చర్చల ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది. మేము గాజాకు, పాలస్తీనాకు మద్దతుగా నిలబడతాము

Israel Palestine Conflict: గాజాకు మద్దతిస్తాం, వాళ్లేమడిగినా ఇస్తాం.. బెంగాల్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Updated On : October 14, 2023 / 7:08 PM IST

Maulana Siddiqullah Chowdhury: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి జమియత్-ఎ-ఉలేమా పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు మౌలానా సిద్ధిఖుల్లా చౌదరి పెద్ద ప్రకటనే చేశారు. గాజా, పాలస్తీనా ప్రజలకు ఆయన బహిరంగ మద్దతు ప్రకటించారు. వారికి అండగా ఉంటామని, వారికి ఏం అవసరం ఉన్నా ఏర్పాటు చేస్తామని అన్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఇజ్రాయెల్ కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగాల్ మంత్రి మౌలానా సిద్ధిఖుల్లా అందుకు పరోక్షంగా పాలస్తీనాకు మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమైంది.

ఈ సందర్భంగా మౌలానా సిద్ధిఖుల్లా చౌదరి మాట్లాడుతూ.. ‘‘ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదు. యుద్ధం ద్వారా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు. చర్చల ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది. మేము గాజాకు, పాలస్తీనాకు మద్దతుగా నిలబడతాము. వారికి ఏది అవసరమో దానిని ఏర్పాటు చేస్తాము. వారికి అన్నీ అందజేస్తాం’’ అని అన్నారు. మౌలానా సిద్ధిఖుల్లా చౌదరి పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాస్ ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ అండ్ లైబ్రరీ సర్వీసెస్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి: Pranjali Awasthi: 16 ఏళ్లకే 100 కోట్ల కంపెనీ స్థాపించిన భారత అమ్మాయి.. ఏడేళ్ల వయసులోనే కోడింగ్

పాలస్తీనా భూములు, ఆస్తులు లాక్కుంటున్నారని సిద్ధిఖుల్లా చౌదరి అన్నారు. వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. గాజా, పాలస్తీనాకు జరుగుతున్న ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడతామని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్‌కు భారత ప్రభుత్వ మద్దతు, గాజా-పాలస్తీనాకు వ్యతిరేకంగా దాని విధానాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పాలస్తీనాను వ్యతిరేకిస్తూనే ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌పై ప్రశంసలు కురిపించారని ఆయన అన్నారు. ఈ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు దాదాపు 2,800 మంది మరణించినట్లు సమాచారం.