మగబిడ్డ పుట్టాలని 4 ఏళ్ల మగపిల్లాడిని బలి ఇచ్చిన అత్తాకోడళ్లు

  • Published By: nagamani ,Published On : August 18, 2020 / 03:34 PM IST
మగబిడ్డ పుట్టాలని 4 ఏళ్ల మగపిల్లాడిని బలి ఇచ్చిన అత్తాకోడళ్లు

మన సంతోషం కోసం మరో తల్లి కడుపులో చిచ్చు పెట్టారు అత్తాకోడళ్లు. కోడలికి మగపిల్లాడు పుట్టాలనే కోడలి ఆశకు అత్తా తోడైంది. కోడలితో కలిసిన ఆ అత్త ల ఘాతుకానికి ముక్కుపచ్చలారని పసిబిడ్డడు బలైపోయాడు. మగపిల్లాడు పుట్టాలనే ఆ అత్తాకోడళ్లు మూర్ఘత్వం..మూఢత్వం నాలుగేళ్ల మగపిల్లాడిని బలి తీసుకుంది. ఈ ఘటన బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్‌ జిల్లాలోని చితౌనాలో 2017లో జరిగింది. దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోంది. ఈ కేసులో న్యాయస్థానం మానవత్వం లేకుండా ఓ పసిబిడ్డను బలి ఇచ్చిన ఆ అత్తాకోడళ్లకు ఉరిశిక్షను ఖరారు చేస్తు తీర్పునిచ్చింది. అత్త దుర్గావతి..కోడలు సంకేషా దేవిలకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ న్యాయమూర్తి లవ్‌కుశ్‌ కుమార్ సోమవారం‌ (ఆగస్టు 17,2020) తీర్పునిచ్చారు.



వివరాల్లోకి వెళితే..గోపాల్‌గంజ్ జిల్లాలోని విజయపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిటౌనాలో దుర్గాదేవి..కుటుంబం నివసిస్తోంది. వారి కోడలు సంకేషా దేవికి మగపిల్లాడు పుట్టాలని కోరిక. దీనికోసం చేయరాని ఘాతుకానికి ఒడిగట్టారు అత్తాకోడళ్లు. ఓ మగపిల్లాడిని బలి ఇస్తే తనకు మగబిడ్డ పుడతాడని నమ్మింది కోడలు. దీని కోసం అత్త సహాయం తీసుకుంది. మగపిల్లాడి కోసం గాలింపు మొదలుపెట్టింది.



ఈక్రమంలో అదే ప్రాంతంలో నివసించే ఓకుటుంబానికి చెందిన డియో కుమార్ అనే నాలుగేళ్ల పిల్లాడిని బలి ఇచ్చేందుకు సిద్దమయ్యారు. మంచి ప్లాన్ కూడా వేసుకున్నారు. ఆ ప్లాన్ లో భాగంగా..2017 సెప్టెంబర్‌ 5న అత్తాకోడళ్లిద్దరూ కలిసి డియో కుమార్‌ ఎత్తుకొచ్చి కోడలు సంకేశాదేవి పడక గదిలో దాచిపెట్టారు. తరువాత ఇద్దరూ కలిసి వేట కొడవలితో ఆ బిడ్డను హత్య చేశారు. తరువాత శవాన్ని ఇంటికి కొద్ది దూరంలో ఉండే గడ్డికుప్పలో కప్పెట్టేశారు. తరువాత ఏమీ తెలియనట్లుగా ఉండిపోయారు.



పిల్లాడు కనిపించకపోవటంతో డియో కుమార్ తల్లిదండ్రులు వెతికి వెతికి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుర్గావతి ఇంటికి దగ్గరలో ఉన్న గడ్డికుప్పలో పిల్లాడి మృతదేహం లభ్యం కావటంతో పోలీసులు వారిని అనుమానించారు. దర్యాప్తులో భాగంగా అత్తాకోడళ్ల ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు రక్తపు బట్టలు, వేట కొడవళ్లు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని విచారించంగా అసలు విషయాన్ని బైటపెట్టారు.



గడ్డికుప్పలో లభ్యమైన పిల్లాడి శవంపై ఆరు కత్తిపోట్లు గుర్తించారు. ఆ తరువాత బాలుడి గొంతు కోసి ఉండటాన్ని గుర్తించారు. అనంతంర బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. బాలుడి శరీరంపై ఆరు కత్తిపోట్లు ఉన్నాయనీ..గొంతుకోసం చంపేసినట్లుగా రిపోర్ట్ వచ్చింది. ఈకేసు దాదాపు మూడు సంవత్సరాలు కొనసాగగా..ఎట్టకేలకూ మానవత్వం మరచి..మూఢత్వంతో చిన్ని బిడ్డను బలి ఇచ్చిన అత్తా కోడళ్లిద్దరికి న్యాయమూర్తి లవ్‌కుశ్‌ కుమార్ సోమవారం‌ (ఆగస్టు 17,2020) తీర్పునిచ్చారు.