లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చిన వ్యక్తిపై బాబాకా ధాబా ఓనర్ కంప్లైంట్

లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చిన వ్యక్తిపై బాబాకా ధాబా ఓనర్ కంప్లైంట్

Baba Ka Dhaba: బాబా కా ధాబా నడిపిస్తున్న కంతా ప్రసాద్(80) అనే వ్యక్తి పోలీస్ కంప్లైంట్ వరకూ వెళ్లాడు. దక్షిణ ఢిల్లీలో ఉండే ఈ వ్యక్తి వీడియోను ఓ యూట్యూబర్ అప్ లోడ్ చేశాడు. అలా వచ్చిన డబ్బును తమకు చెందకుండా యూట్యూబర్ వాడుకుంటున్నాడని వాళ్లు ఫిర్యాదు చేశారు. అక్టోబరు 7న తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా షేర్ అయింది.

మాల్వియా నగర్‌లో ఎక్కువ సంఖ్యలో కస్టమర్లు వచ్చేలా చేసింది. వారి వరకూ రాకుండానే మరికొందరు మనీ డొనేట్ చేశారు. వాసన్ అనే యూట్యూబర్‌‍పై నమోదైన కంప్లైంట్ గురించి మీడియాతో ఆ బాధితుడు ఇలా మాట్లాడాడు.



‘కస్టమర్లు ఇక్కడకు ఎక్కువగా ఏం రావడం లేదు. కేవలం సెల్ఫీల కోసమే వస్తున్నారు. స్టార్టింగ్ లో రోజుకు రూ.10వేల వరకూ అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు రూ.3వేల నుంచి రూ.5వేలు మాత్రమే’ జరుగుతున్నాయి. అని కంప్లైంట్ చేసిన ప్రసాద్ అనే వ్యక్తి వివరించాడు.

తమ పేరు చెప్పుకుని వాసన్ అనే యూట్యూబర్ అతని కుటుంబానికి చాలా ఆధాయం సంపాదిస్తున్నాడంటూ కంప్లైంట్ చేశాడు. ‘శనివారం చేసిన కంప్లైంట్ మాకు అందిందని దానిపై విచారణ చేపట్టాం’ అని డీసీపీ చెబుతూ ఇంకా ఎఫ్ఐఆర్ రిజిష్టర్ అవలేదని చెప్పారు.



ఈ ఆరోపణలను యూట్యూబర్ వాసన్ కొట్టిపారేశాడు. అతనికి వచ్చిన డబ్బు మొత్తం ప్రసాద్ అకౌంట్ కు ట్రాన్సఫర్ చేశానని చెప్పాడు. ‘ఆ వీడియో షూట్ చేసినప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుందని తెలియదు. బాబాను అందరూ వేధించడం ఇష్టం లేక నా బ్యాంక్ వివరాలే ఇచ్చా’ అని అతనికి వచ్చిన ట్రాన్సాక్షన్ల రసీదులను షేర్ చేశారు.
https://10tv.in/frustrated-russian-youtuber-sets-rs-2-4-crore-mercedes-car-on-fire-as-it-kept-malfunctioning/
రెండు చెక్ లలో ఒకటి లక్ష రూపాయలు కాగా, మరొకటి 2లక్షల 33వేలు. ఇంకొక బ్యాంక్ పేమెంట్ రసీదు 45వేల రూపాయలు. ఇదంతా తాను మూడు రోజుల్లో కలెక్ట్ చేసిన డబ్బేనని చెప్పాడు. ఈ మూడు రోజుల్లో వచ్చింది రూ.3.5లక్షలేనని వెల్లడించాడు.



ఇదిలా ఉంటే మిగిలిన యూట్యూబర్లు వాసన్ దాదాపు రూ.20-25 లక్షల వరకూ డబ్బు అందుకున్నాడని.. ఒప్పుకోవడం లేదని చెప్తున్నారు.