HD Kumaraswamy: ప్రజల డబ్డుతో హిందీ భాషా దినోత్సవం చేయాల్సిన అవసరం లేదు

కర్ణాటకలో బలవంతంగా హిందీ భాషా దినోత్సవం నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే ఈ ప్రయత్నం జరుగుతోందని వేరే చెప్పనక్కర్లేదు. ఈ దేశం వివిధ భాషల, వివిధ ప్రాంతాల కలయిక. ఏ ఒక్కరి పెత్తనం మరొకరిపై పని చేయదు. ఏ ఒక్కరి అలవాట్లు, పద్దతులు మిగతా వారిపై రుద్దాల్సిన అసవరం లేదు. ఒక్కో భాషకు ఒక్కో అస్థిత్వం ఉంది

HD Kumaraswamy: ప్రజల డబ్డుతో హిందీ భాషా దినోత్సవం చేయాల్సిన అవసరం లేదు

Kumaraswamy On meeting with kcr

HD Kumaraswamy: సెప్టెంబర్ 14న రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరగబోయే ‘హిందీ భాషా దినోత్సవం’పై మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి కుమారస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు చెల్లించిన పన్నులతో హిందీ భాషా దినోత్సవం జరపాల్సిన అసవరం లేదని ఆయన స్పష్టం చేశారు. బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం జరుగుతోందని, అందులో భాగంగానే హిందీ భాషా దినోత్సవాన్ని సైతం బలవంతంగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది పూర్తిగా అన్యాయమని కుమారస్వామి విమర్శించారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి ఆయన సోమవారం లేఖ రాశారు.

ఈ లేఖలో ‘‘కర్ణాటకలో బలవంతంగా హిందీ భాషా దినోత్సవం నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే ఈ ప్రయత్నం జరుగుతోందని వేరే చెప్పనక్కర్లేదు. ఈ దేశం వివిధ భాషల, వివిధ ప్రాంతాల కలయిక. ఏ ఒక్కరి పెత్తనం మరొకరిపై పని చేయదు. ఏ ఒక్కరి అలవాట్లు, పద్దతులు మిగతా వారిపై రుద్దాల్సిన అసవరం లేదు. ఒక్కో భాషకు ఒక్కో అస్థిత్వం ఉంది. కన్నడిగుల అస్థిత్వం, భాష వారికి ఉంది. ప్రజలు చెల్లించిన పన్నులతో హిందీ భాషా దోనోత్సవం నిర్వహించాల్సిన అవసరం లేదు. వేరే భాషా పండుగలు ఇక్కడ నిర్వహించాల్సిన అవసరం లేదు. అలా చేస్తే కన్నడిగులను అవమానించడమే’’ అని కుమారస్వామి రాసుకొచ్చారు.

Mehbooba Mufti: కశ్మిరీలకు ఎలాంటి హక్కు లేదు, వారి గోడు చెప్పుకునేందుకు వినే దిక్కులేదు: మెహబూబా