6 Year Girl Letter To Modi : ధరల పెరుగుదలపై మోడీకి ఆరేళ్ల చిన్నారి లేఖ..ముద్దుముద్దు మాటలతో ఘాటైన ప్రశ్నలు

పెన్సిల్..ఎరేజర్ కొనివ్వమంటే అమ్మ కొడుతోంది సార్..ఇవి కూడా ఖరీదుగా అయిపోయాయి. పెన్సిల్, ఎరేజర్ లేకపోతే నేను ఎలా చదువుకోవాలి? అంటూ ముద్దు ముద్దు మాటలతో ఘాటైన ప్రశ్నలు సంధిస్తూ ఆరేళ్ల బుజ్జాయి ప్రధాని మోడీకి లేఖ రాసింది.

6 Year Girl Letter To Modi : ధరల పెరుగుదలపై మోడీకి ఆరేళ్ల చిన్నారి లేఖ..ముద్దుముద్దు మాటలతో ఘాటైన ప్రశ్నలు

6 Year Old Girl’s Letter To PM Modi : పెన్సిల్..ఎరేజర్ కొనివ్వమంటే అమ్మ కొడుతోంది సార్..ఇవి కూడా ఖరీదుగా అయిపోయాయి. పెన్సిల్, ఎరేజర్ లేకపోతే నేను ఎలా చదువుకోవాలి? అంటూ ముద్దు ముద్దు మాటలతో ఘాటైన ప్రశ్నలు సంధిస్తూ ఆరేళ్ల బుజ్జాయి ప్రధాని మోడీకి లేఖ రాసింది. మరి ఈ చిన్నారి అడిగిన ఈ ప్రశ్నలకు మోడీ సమాధానం చెబుతారా? చిన్నారులను ముద్దు చేస్తూ ఫోటోలు దిగి వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రధాని మోడీ..ఈ చిన్నారి ప్రశ్నలకు సమాధానం చెబుతారా? ఈ చిన్నారి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే దేశం మొత్తానికి సమాధనం చెప్పినట్లే. అలా ఉన్నాయి ఈ చిన్నారి లేఖలో పేర్కొన్న ప్రశ్నలు.

ముద్దు ముద్దుగా మాట్లాడుతునే చెంపపెట్టులాంటి ఘాటైన ప్రశ్నలు సంధించిందా చిన్నారి. ఈ చిన్నారి ప్రధానికి సంధించిన ప్రశ్నలు దేశంలో ప్రతీ వస్తువు మీద పెరిగిన ధరలను తేటతెల్లం చేస్తోంది.పెన్సిల్‌, రబ్బర్‌ ధరలు పెరిగాయని..ఇది తనకు చాలా ఇబ్బందికరంగా మారిందని..ఓసారి పెన్సిల్‌ పోగొట్టుకోవడంతో మా అమ్మ ననన్ను చీవాట్లు పెట్టిందని కనౌజ్‌ జిల్లాలోని ఛిబ్రమౌ పట్టణానికి చెందిన కృతీ దూబే అనే ఒకటో తరగతి విద్యార్థిని ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొంది. స్కూళ్లో పెన్సిల్‌ పోగొట్టుకున్నానని తెలిసి తన తల్లి మందలించిందని, ఇలా ధరలు పెంచేస్తే ఎలా? అని ఆ బాలిక మోదీని లేఖలో నిలదీసింది. హిందీలో రాసివున్న ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.