Nitish meets Tejashwi: గతాన్ని మర్చిపోదాం: కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తేజస్వీని బుజ్జగించిన నితీష్

ఇక 2020లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన నితీష్, తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కూడా ఆర్జేడీ లాగే బీజేపీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎన్నికల నాటి నుంచే నితీష్‭ను దెబ్బకొట్టే ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఆర్జేడీతో విడిపోయినప్పటి నుంచి నితీష్ ప్రభుత్వంపై తేజస్వీ విరోచిత పోరాటం చేస్తున్నారు. నిన్నటి వరకు ఈ పరంపర కొనసాగుతూనే వచ్చింది

Nitish meets Tejashwi: గతాన్ని మర్చిపోదాం: కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తేజస్వీని బుజ్జగించిన నితీష్

Forget 2017 and begin a new chapter says nitish ot tejashwi

Nitish meets Tejashwi: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా బీజేపీతో పొత్తును తెంచుకున్న నితీష్ కుమార్.. రాజ్ భవన్ నుంచి నేరుగా రబ్రీదేవి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఆర్జేడీ కీలక నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‭ని కలుసుకున్నారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలయికకు నితీష్ ప్రత్యేక చొరవ తీసుకుని తేజస్వీని బుజ్జగించారట. 2017లో జరిగిన ఘటనను మర్చిపోయి ఇప్పుడు నూతనంగా ముందుకు సాగుదామని తేజస్వితో అన్నారని, ఇందుకు తేజస్వీ కూడా అంగీకరించినట్లు సమాచారం.

2015లో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి కట్టి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమిలో ఆర్జేడీ ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ పొత్తు ప్రకారం.. నితీష్‭ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం రెండేళ్లకు అంటే 2017లో అప్పటి ఉప ముఖ్యమంత్రి తేజస్వీపై అవినీతి ఆరోపణలు చేసి పొత్తు తెంచుకున్నారు నితీష్. వెంటనే బీజేపీతో జతకట్టి ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

BJP vs Nitish: బీజేపీతో విభేదాలకు కారణాలు ఇవే..!

ఇక 2020లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన నితీష్, తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కూడా ఆర్జేడీ లాగే బీజేపీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎన్నికల నాటి నుంచే నితీష్‭ను దెబ్బకొట్టే ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఆర్జేడీతో విడిపోయినప్పటి నుంచి నితీష్ ప్రభుత్వంపై తేజస్వీ విరోచిత పోరాటం చేస్తున్నారు. నిన్నటి వరకు ఈ పరంపర కొనసాగుతూనే వచ్చింది. అయితే తాజాగా బీజేపీతో దోస్తీని కట్ చేసి ఆర్జేడీతో చేతులు కలపున్న నితీష్‭కు తేజస్వీ నుంచి వెంటనే మద్దతు లభించడం అనూహ్యం. తాజాగా ఏర్పడే ప్రభుత్వంలో 2015 నాటి కాంబినేషన్ రిపీట్ కాబోతోందట. అంటే నితీష్ మళ్లీ ముఖ్యమంత్రి, తేజస్వీ ఉపముఖ్యమంత్రి కాబోతున్నారట.

2015 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ‘బిహారీ-బాహారీ’ (బిహారీలు-బయటివారు) అనే నినాదాన్ని ఇరు నేతలు బలంగా వినిపించి మెరుపు వేగంతో దేశంలో విస్తరిస్తోన్న బీజేపీని బిహార్‭లో నిలువరించారు. ఇప్పుడు మళ్లీ బిహారీలు ఒక్కటై బాహారీని (వీళ్ల ఉద్దేశంలో బీజేపీ బయటి పార్టీ అని) అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో ఎన్నికలు వస్తే తెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

Chirag Paswan demand President rule: బిహార్‭లో రాష్ట్రపతి పాలనకు చిరాగ్ డిమాండ్