Chirag Paswan demand President rule: బిహార్‭లో రాష్ట్రపతి పాలనకు చిరాగ్ డిమాండ్

నితీష్ ఏంటనేది ఈరోజుతో మరింత స్పష్టమైపోయింది. ఆయనకు ఈరోజు విశ్వసనీయత అనేదే మిగలకుండా పోయింది. రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడమే కాకుండా తాను కూడా వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేం డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో కొత్తగా ఎన్నికలు పెట్టాలి. అసలు నీకు (నితీష్) ఒక భావజాలం అంటూ ఉందా లేదో ఆ ఎన్నికల్లో తేలుతుంది. మళ్లీ ఎన్నికలు జరిగితే జేడీయూకి ఒక్క సీటు కూడా రాదు

Chirag Paswan demand President rule: బిహార్‭లో రాష్ట్రపతి పాలనకు చిరాగ్ డిమాండ్

Chirag Paswan demand President rule

Chirag Paswan demand President rule: నితీష్ కుమార్ రాష్ట్రాన్ని వెనక్కు నెట్టేయడమే కాకుండా తాను కూడా వెనక్కి వెళ్లిపోయారని, ఈరోజు ఆయనకు అసలు విశ్వసనీయతే లేకుండా పోయిందని లోక్ జన్‭శక్తి పార్టీ (రాం విలాస్ పాశ్వాన్) అధినేత చిరాగా పాశ్వాన్ అన్నారు. బిహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన మంగళవారం న్యూఢిల్లీలోని ఎల్‭జేపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నితీష్ కుమార్‭పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతే కాకుండా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని, అప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పు ఏంటో తెలుస్తుందని చిరాగ్ అన్నారు.

‘‘నితీష్ ఏంటనేది ఈరోజుతో మరింత స్పష్టమైపోయింది. ఆయనకు ఈరోజు విశ్వసనీయత అనేదే మిగలకుండా పోయింది. రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడమే కాకుండా తాను కూడా వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేం డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో కొత్తగా ఎన్నికలు పెట్టాలి. అసలు నీకు (నితీష్) ఒక భావజాలం అంటూ ఉందా లేదో ఆ ఎన్నికల్లో తేలుతుంది. మళ్లీ ఎన్నికలు జరిగితే జేడీయూకి ఒక్క సీటు కూడా రాదు’’ అని పాశ్వాన్ అన్నారు.

Bihar crisis: గవర్నర్‭తో మీటింగ్ తర్వాత నితీష్ రాజీనామా?