Hijab Row: ‘హిజాబ్‌కు లేదా కాషాయానికి ప్రభుత్వం దేనికీ సపోర్ట్ కాదు’

కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోఖ తాము (ప్రభుత్వం) హిజాబ్ కు గానీ, కాషాయానికి గానీ దేనికీ సపోర్టింగ్ గా లేమంటూ వ్యాఖ్యలు చేశారు.

Hijab Row: ‘హిజాబ్‌కు లేదా కాషాయానికి ప్రభుత్వం దేనికీ సపోర్ట్ కాదు’

Hizab

Hijab Row: హిజాబ్ కాంట్రవర్సీతో కర్ణాటక అట్టుడికిపోతుంది. ఈ క్రమంలో స్టూడెంట్స్ ఏం ధరించి రావాలో అనేది ప్రశ్నార్థకంగా మారింది. కోర్టులో ఈ మేర విచారణ జరుగుతుండటంతో విద్యార్థులంతా శాంతి, సామరస్యంతో ఉండాలని పిలుపునిస్తూ కర్ణాటక సీఎం మూడు రోజుల పాటు విద్యాసంస్థలు మూసేయాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే, కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోఖ తాము (ప్రభుత్వం) హిజాబ్ కు గానీ, కాషాయానికి గానీ దేనికీ సపోర్టింగ్ గా లేమంటూ వ్యాఖ్యలు చేశారు.

‘స్కూల్స్, కాలేజెస్ మూసేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ రాజకీయాల వెనుక కాంగ్రెస్ ఉంది. కోర్టులో విచారణ జరుగుతుండగా దీని గురించి ఎవ్వరూ కామెంట్ చేయరు కూడా. ప్రభుత్వం హిజాబ్ కు లేదా కాషాయానికి సపోర్టింగ్ గా లేదు. కాకపోతే స్కూల్ విద్యార్థులు డ్రెస్ కోడ్ మాత్రం కంపల్సరీ’ అని చెప్పుకొచ్చారు కర్ణాటక ఆర్థిక శాఖ మంత్రి.

Read Also: చిరంజీవి మా నాయకుడే.. కానీ సీఎంకు ఇదే నా విజ్ఞప్తి..: తమ్మారెడ్డి భరద్వాజ

కర్ణాటక హైకోర్టులో బుధవారం గవర్నమెంట్ ప్రీ యూనివమర్సిటీ కాలేజ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్లు ఫైల్ చేసిన పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 4న ఉడుపిలో గవర్నమెంట్ గర్ల్స్ పీయూ కాలేజీ వేదికగా ఈ హిజాబ్ ఆందోళనలు మొదలయ్యాయి. పలువురు స్టూడెంట్లు తాము ఇతరులు హిజాబ్ ధరించినందుకుగానూ క్లాసులు హాజరుకామంటూ డిమాండ్ చేశారు.