Mahua On Rajpath: ప్రధాని నివాసానికి ‘కింకర్తవ్యవిమూఢ మఠ్’ అని పెడతారు.. రాజ్‭పథ్ పేరు మార్పుపై టీఎంసీ సెటైర్లు

చారిత్రక రాజ్‭పథ్, సెంట్రల్ విస్టా లాన్స్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చనున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 2047 నాటికి భారత్ సాధించాల్సిన అంశాలపై ప్రధాని మోదీ కొన్ని ప్రమాణాలు చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రాజ్‭పథ్‭ను ‘కర్తవ్య పథ్‭’గా పేరు మార్చనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి

Mahua On Rajpath: ప్రధాని నివాసానికి ‘కింకర్తవ్యవిమూఢ మఠ్’ అని పెడతారు.. రాజ్‭పథ్ పేరు మార్పుపై టీఎంసీ సెటైర్లు

Mahua Moitra blasts BJP over Rajpath new name

Mahua On Rajpath: పేరు మార్పలపై బీజేపీ నేతలు ఎప్పటి నుంచో విమర్శలు ఎదుర్కొంటున్నారు. మోదీ 2014లో మొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్లానింగ్ కమిషన్ పేరును నీతి అయోగ్ అని మార్చారు. ఇక అప్పటి నుంచి పలు సందర్భాల్లో పలు పేర్లను మారుస్తూ వస్తున్నారు. దీంతో బీజేపీ అంటేనే పేరు మార్చే పార్టీ అన్నట్లు వ్యతిరేకులు, ఇతరులు విమర్శలు చేస్తుంటారు. కాగా, తాజాగా మరో పేరు మార్పు విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

న్యూఢిల్లీలోని రాజ్‭పథ్ పేరును కర్తవ్య పథ్‭గా మార్చనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మోయిత్రా విమర్శలు గుప్పించారు. మంగళవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆమె స్పందిస్తూ ‘‘వాళ్లు రాజ్‭పథ్ పేరును కర్తవ్య్ పథ్‭గా మారుస్తున్నారని విన్నాను. అయితే ప్రధానమంత్రి కార్యాలయాన్ని కింకర్తవ్యవిమూఢ మఠ్ అని మారుస్తారని నేను అనుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‭లో బెంగాలీలో అత్యుత్తమ నాన్సెన్స్ స్టోరీస్‌లో ఒకటైన హజబరలను ప్రస్తావించారు. ఇది చిన్న పిల్లల నవల. దీనిలో ఓ పాత్ర ప్రతివారికీ, ప్రతిదానికీ ఓ వింత పేరును పెడుతూ ఉంటుంది. కాగా, కింకర్తవ్యవిమూఢ అంటే గందరగోళం, అయోమయం నిండినవారు, దేనినీ అర్థం చేసుకోలేనివారని అర్థం.

చారిత్రక రాజ్‭పథ్, సెంట్రల్ విస్టా లాన్స్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చనున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 2047 నాటికి భారత్ సాధించాల్సిన అంశాలపై ప్రధాని మోదీ కొన్ని ప్రమాణాలు చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రాజ్‭పథ్‭ను ‘కర్తవ్య పథ్‭’గా పేరు మార్చనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దేశ రాజధానిలో ప్రత్యేకించి పార్లమెంటు పరిధిలో చాలా రోడ్లకు బ్రిటీషర్ల కాలం నాటి పేర్లే ఉన్నాయి. వాటన్నిటినీ పూర్తిగా భారతీయ సంస్కృతిలో భాగం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

PM Candidature: నాకు ఆ కోరిక లేదు.. ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై నితీశ్ సంచలన ప్రకటన