ముంబై హాస్పిటల్లో 26 మంది నర్సులు, 3 డాక్టర్లకు కరోనా

ముంబై హాస్పిటల్లో 26 మంది నర్సులు, 3 డాక్టర్లకు కరోనా

భారతదేశంలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసుల్లో టాప్‌గా ఉన్న మహారాష్ట్రలో హాస్పిటల్ కు వెళ్లాలన్నా భయం. 26మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లకు కరోనా పాజిటివ్ రావడంతో పేషెంట్లకు దిక్కుతోచని పరిస్థితి. Wockhardt హాస్పిటల్ లో ఈ ఘటన సంభవించడంతో పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. (COVID-19: ప్రధాని, రాష్ట్రపతి, ఎంపీల జీతాల్లో కోత)

బిల్డింగ్ లోకి రాకుండా, ఏ ఒక్కరూ బయటకు వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు. టెస్టుల్లో రెండు సార్లు నెగెటివ్ వస్తేనే బయటకు పంపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నార్మల్ వార్డుల్లో ఉన్న 270మంది పేషెంట్లు, నర్సులు అందరికీ పరీక్షలు నిర్వహించారు. ఓపీ విభాగంతో పాటు, ఎమర్జెన్సీ సర్వీసులు కూడా నిలిపేశారు. హాస్పిటల్ క్యాంటినే నర్సులు, పేషెంట్లకు ఆహారం ఏర్పాటు చేస్తుంది.

బఫ్ఫర్ జోన్స్, మూసి వేసి ఉండే ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆదివారం ప్రకటించింది. డిసెంబరు నెల చైనాలో పుట్టిన కరోనా.. క్రమంగా పెరుగుతూ మహమ్మారిగా మారింది. ఓ నాలుగు వారాల పాటు ఏ కేసు నమోదవకపోతేనే అదుపులోకి వచ్చినట్లుగా కన్ఫామ్ చేసుకుంటారు. 

ముంబైలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. మహారాష్ట్రలో నమోదైన 745 కేసుల్లో 458 ముంబైలోనివే. ఆసియాలోనే పెద్ద బస్తీ ప్రాంతమైన దారావి  ప్రాంతంలో అయిదుగురికి పాజిటివ్ గా తేలింది. ముంబై నగరంలో ఇప్పటికీ 45మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశ వ్యాప్తంగా 4వేల మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 100కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు.