సానియా సీరియస్ : నా దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరంలేదు

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కోపం వచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లు తన గురించి చేస్తున్న విమర్శలపై మండిపడింది. నా దేశభక్తిని శంకిస్తారా? అంటూ ఫైర్

  • Published By: veegamteam ,Published On : February 17, 2019 / 03:34 PM IST
సానియా సీరియస్ : నా దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరంలేదు

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కోపం వచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లు తన గురించి చేస్తున్న విమర్శలపై మండిపడింది. నా దేశభక్తిని శంకిస్తారా? అంటూ ఫైర్

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కోపం వచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లు తన గురించి చేస్తున్న విమర్శలపై మండిపడింది. నా దేశభక్తిని శంకిస్తారా? అంటూ ఫైర్ అయ్యింది. నాకు దేశభక్తి ఉంది అంటూ గొంతుచించుకుని అరవమంటారా అని ప్రశ్నించింది. దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదంది. సీఆర్పీఎఫ్ జవాన్లకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చింది.

 

సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే దేశభక్తి ఉందని భావించేవాళ్ల కోసమే తాను ఈ పోస్ట్ పెడుతున్నానని సానియా తెలిపింది. తాము సెలబ్రిటీలం కాబట్టి తమపై బురద చల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అయినా ఎవరో విమర్శించారని తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరంలేదని సానియా చెప్పింది. తాము కూడా దేశభక్తులమేనని, ఉగ్రవాదానికి వ్యతిరేకం అని గొంతు చించుకుని అరవాల్సిన పనిలేదని వివరించింది. ఏ విధంగా అయితే దేశం కోసం చెమటోడ్చి ఆడతానో.. అదే విధంగా దేశానికి సేవ చేస్తానని సానియా చెప్పింది. సీఆర్పీఎఫ్ జవాన్లను రియల్ హీరోలతో పోల్చింది. వాళ్ల కుటుంబాలకు జీవితాంతం తోడుగా ఉంటాననంది. పుల్వామా దాడి జరిగిన ఫిబ్రవరి 14 దేశచరిత్రలో దుర్దినం అని… ఇప్పటికీ తాను ద్వేషం కంటే శాంతినే కోరుకుంటాను అని సానియా స్పష్టం చేసింది. ‘ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే… ఏదైనా మంచి పని కోసం ట్రోల్ చేయండి, సెలబ్రిటీలు ఏమని పోస్ట్ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు పెడుతున్నారు అని కాదు మీరు చూడాల్సింది. దేశానికి మీ వంతు ఏదైనా చేయండి తప్ప ఇలాంటి ట్రోలింగ్‌లు మాత్రం చేయకండి” అంటూ తన పోస్టులో ఫైర్ అయ్యింది సానియా మీర్జా.

 

పుల్వామా ఉగ్రదాడి(ఫిబ్రవరి 14-2019) తర్వాత సానియా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫ్యాషన్ ఫొటోలు అప్‌లోడ్ చేయడం ఆమెను చిక్కుల్లో పడేసింది. అసలే పాకిస్తాన్‌కు చెందిన షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకోవడంతో ఆమెను అందరూ పాకిస్తాన్ కోడలిగానే చూస్తున్నారు. దీనికి తోడు ఫ్యాషన్ ఫొటోలు అప్‌లోడ్ చేసింది. దాంతో ఆమె దేశభక్తిని శంకిస్తూ అనేక పోస్టులు, కామెంట్లు, విమర్శలు వెల్లువెత్తాయి.