మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ శాతం ఎంత నమోదైందో తెలుసా?

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది.

మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ శాతం ఎంత నమోదైందో తెలుసా?

Amit Shah

Lok sabha Election 2024 : దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, గోవా, దాద్రానగర్ హవేలీ – దమణ్ దీవ్ రాష్ట్రాల్లో మొత్తం 92 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 17.24కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం 1.85లక్షల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది.

Also Read : కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటు వేసిన ప్రధాని మోదీ.. ఓ వృద్ధ మహిళ మోదీ వద్దకు వచ్చి ఏం చేశారంటే?

  • మధ్యాహ్నం 1గంట వరకు 39.92శాతం పోలింగ్ నమోదైంది.
    బీహార్ – 36.69%
    ఛత్తీస్‌గఢ్ – 46.14%
    దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ -39.94%
    గోవా – 49.04%
    గుజరాత్ – 37.83%
    కర్ణాటక – 41.59%
    మధ్యప్రదేశ్ – 44.67%
    మహారాష్ట్ర – 31.55%
    ఉత్తరప్రదేశ్ – 38.12%
    పశ్చిమ బెంగాల్ – 49.27%