Rahul Gandhi: బ్రిటిషర్లకు సావర్కర్ రాసిన లేఖను బయట పెట్టిన రాహుల్ గాంధీ

ఇక ఇదే మీడియా సమావేశంలో దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాహుల్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, ఎన్నడూ లేనంత నిరుద్యోగిత నేడు కనిపిస్తోందని, అయినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని రాహుల్ విమర్శించారు. నిరుద్యోగులకు, రైతులకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహాయం అందడం లేదని, పైగా వారిని మరింత ఇబ్బందులకు గురి చేసేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాహుల్ అన్నారు.

Rahul Gandhi: బ్రిటిషర్లకు సావర్కర్ రాసిన లేఖను బయట పెట్టిన రాహుల్ గాంధీ

Savarkar betrayed Mahatma Gandhi says Rahul Gandhi

Updated On : November 17, 2022 / 3:10 PM IST

Rahul Gandhi: బ్రిటిషర్లకు వీర్ సావర్కర్ రాసిన లేఖను కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ గురువారం బయటపెట్టారు. ఆ లేఖలో బ్రిటిషర్లను సావర్కర్ వేడుకున్నారని, అందులో ఆయన సంతకం కూడా ఉందని రాహుల్ అన్నారు. ఆ లేఖను మీడియాకు చూపించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం మహారాష్ట్రలో యాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ.. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘‘బ్రిటిషర్లకు వీర్ సావర్కర్ రాసిన లేఖలో ‘సర్, నేను మీకు నమ్మకైన బంటుగా ఇక నుంచి ఉంటానని మిమ్మల్ని వేడుకుంటున్నాను’ అని అన్నారు, అందులో ఆయన సంతకం కూడా ఉంది. బ్రిటిషర్లకు సావర్కర్ సహాయం చేశారు. అలాగే మహాత్మా గాంధీ, జవహార్‭లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వారికి ద్రోహం చేశారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

సావర్కర్‭పై ఇలాంటి ఆరోపణలు చాలా కాలంగానే ఉన్నాయి. అయితే అధికార భారతీయ జనతా పార్టీ సావర్కర్‭ను దేశభక్తుడిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. సావర్కర్‭ స్వస్థలం మహారాష్ట్ర కావడంతో ప్రస్తుతం అదే రాష్ట్రంలో యాత్ర చేస్తున్న రాహుల్ ఈ విధంగా స్పందించారని అంటున్నారు.

ఇక ఇదే మీడియా సమావేశంలో దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాహుల్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, ఎన్నడూ లేనంత నిరుద్యోగిత నేడు కనిపిస్తోందని, అయినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని రాహుల్ విమర్శించారు. నిరుద్యోగులకు, రైతులకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహాయం అందడం లేదని, పైగా వారిని మరింత ఇబ్బందులకు గురి చేసేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాహుల్ అన్నారు.

Ukraine President Zelenskyy: మమ్మల్ని నిందించొద్దు.. ఆ క్షిపణితో మాకు సంబంధంలేదు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ