Ukraine President Zelenskyy: మమ్మల్ని నిందించొద్దు.. ఆ క్షిపణితో మాకు సంబంధంలేదు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

దయచేసి మమ్మల్ని నిందించొద్దు. పొలండ్ దేశం శివారు గ్రామంలో పడింది మా క్షిపణి కాదు. మా టాప్ కమాండర్లు స్పష్టంగా ఈ విషయాన్ని వెల్లడించారు. క్షిపణి పేలిన ప్రాంతంలో మాకు దర్యాప్తు చేసేందుకు అవకాశం ఇవ్వాలి అంటూ జెలెన్ స్కీ కోరాడు.

Ukraine President Zelenskyy: మమ్మల్ని నిందించొద్దు.. ఆ క్షిపణితో మాకు సంబంధంలేదు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

Ukraine President Zelenskyy

Updated On : July 7, 2023 / 4:11 PM IST

Ukraine President Zelenskyy: ఇండోనేషియాలోని బాలి వేదికగా జీ20 దేశాల సదస్సు జరుగుతుండగా ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులతో దాడులు ఉధృతం చేసింది. అయితే ఓ క్షిపణి ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలండ్ శివరులోని షెవాడో గ్రామంలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు. దీంతో పొలండ్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఇదంతా రష్యాపనేనని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ విచారణసైతం ఆదేశించారు.

Ukraine,Russia Tortured Prisoners Of War : యుద్ధ ఖైదీల విషయంలో రష్యా,యుక్రెయిన్ చేసిన దారుణాలను బయటపెట్టిన ఐక్యరాజ్యసమితి

విచారణలో ఆ క్షిపణి రష్యాది కాదని తేలడంతో ఉక్రెయిన్ క్షిపణి కావాచ్చు అంటూ ప్రచారం జరిగింది. పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా ఈ విషయంపై మాట్లాడుతూ.. రష్యా దాడులను ప్రతిఘటించే క్రమంలో ఉక్రెయిన్ క్షిపణులను ప్రయోగించి ఉంటుందని, అది కాస్త మా భూభాగంలో పడి ఉంటుందని, అయితే ఇది కావాలని చేసి ఉండరని అన్నారు. దీంతో నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్ బర్గ్ ఉక్రెయిన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాటో చీఫ్ వ్యాఖ్యలపై జెలెన్ స్కీ స్పందించారు.

Ukraine Vs Russia: రష్యా బాంబుల దాడులు.. అడ్డుకున్న యుక్రెయిన్

దయచేసి మమ్మల్ని నిందించొద్దు. పొలండ్ దేశం శివారు గ్రామంలో పడింది మా క్షిపణి కాదు. మా టాప్ కమాండర్లు స్పష్టంగా ఈ విషయాన్ని వెల్లడించారు. క్షిపణి పేలిన ప్రాంతంలో మాకు దర్యాప్తు చేసేందుకు అవకాశం ఇవ్వాలి అంటూ జెలెన్ స్కీ కోరాడు. పొలండ్ సరిహద్దు గ్రామంలో పడిని క్షిపణి ప్రాంతంలో దర్యాప్తు జరుగుతుందని, క్షిపణి ఎవరిదనేది బయటకొస్తుందని నాటో చీఫ్ తెలిపాడు.