Burger King Outlet: రూ.10 తీసుకొని చిన్నారికి బర్గర్ ఇచ్చిన సిబ్బంది.. సన్మానించిన కంపెనీ ప్రతినిధులు.!

బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో పనిచేసే వ్యక్తి చిన్నారి వద్ద రూ.10 తీసుకొని బర్గర్ ఇచ్చాడు. దీంతో అతన్ని బర్గర్ కింగ్ ఇండియా కంపెనీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

Burger King Outlet: రూ.10 తీసుకొని చిన్నారికి బర్గర్ ఇచ్చిన సిబ్బంది.. సన్మానించిన కంపెనీ ప్రతినిధులు.!

Burger King

Burger King Outlet: బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో పనిచేసే వ్యక్తి చిన్నారి వద్ద రూ.10 తీసుకొని బర్గర్ ఇచ్చాడు. దీంతో అతన్ని బర్గర్ కింగ్ ఇండియా కంపెనీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అదేంటి డబ్బులు తీసుకొని బర్గర్ ఇస్తే సన్మానించడం ఏమిటని అనుకుంటున్నారా..? పూర్తి వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ సమీపంలోని బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లోకి ఓ చిన్నారి వెళ్లింది. ఆ చిన్నారి జేబులోంచి రూ. 10నోటు తీసి బర్గర్ కావాలని అడిగింది. రూ.10 నోటును తీసుకున్న ధీరజ్ కుమార్ అనే వ్యక్తి రూ. 90 విలువైన బర్గర్ ను ఆ చిన్నారికి ఇచ్చాడు. ఆ చిన్నారి సంతోషంతో బర్గర్ ను తీసుకొని వెళ్లింది.

Grape Seeds And Skin : ద్రాక్ష విత్తనాలు, తొక్కను తినకుండా పారేస్తున్నారా! వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే?

రూ. 10 ఇస్తే తన జేబులో నుంచి మరో రూ.80 తీసి చెల్లించి ఆ చిన్నారికి ధీరజ్ కుమార్ బర్గర్ ఇచ్చాడు. అతని మంచి హృదయానికి ఆ చిన్నారి చిరునవ్వుతో వెళ్లింది. చిన్నారి కౌంటర్ వద్ద బర్గర్ తీసుకుంటున్న చిత్రాన్ని లైఫ్ మెంబర్ అనే ట్విటర్యూ జర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ధీరజ్ కుమార్ చిన్నారికి చేసిన సహాయాన్ని అందులో రాశాడు. దీంతో ఆ చిత్రం  సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చిన్నారి పట్ల మంచి మనసును చాటుకున్న ఉద్యోగి ధీరజ్ కుమార్‌గా ఫాస్ట్‌ఫుడ్ కంపెనీ గుర్తించింది. అతని మంచి మనస్సును‌మెచ్చి కంపెనీ ప్రతినిధులు సన్మానించారు. ఈ విషయాన్ని బర్గర్ కింగ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో తెలిపింది. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మా నోయిడా బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ధీరజ్ కుమార్ తన మంచిమనసుతో అందరికీ స్ఫూర్తినిచ్చాడని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ధీరజ్ ను కంపెనీ ప్రతినిధులు అభినందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు.. పరిపూర్ణ మానవత్వంతో ఆ చిన్నారికి బర్గర్ ఇచ్చిన ధీరజ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.