Aadhaar Face RD : ఆధార్‌ కార్డు ఉందా? UIDAI నుంచి కొత్త యాప్‌.. ఎలా వాడాలంటే?

ఆధార్ కార్డు యూజర్లకు గుడ్‌న్యూస్.. యూఐడీఏఐ నుంచి కొత్త యాప్ వచ్చింది. ఆధార్‌‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎన్నో మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

Aadhaar Face RD : ఆధార్‌ కార్డు ఉందా? UIDAI నుంచి కొత్త యాప్‌.. ఎలా వాడాలంటే?

Uidai Launches Aadhaar Face Authentication Service App

Aadhaar Face RD : ఆధార్ కార్డు యూజర్లకు గుడ్‌న్యూస్.. యూఐడీఏఐ నుంచి కొత్త యాప్ వచ్చింది. ఆధార్‌‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎన్నో మార్గదర్శకాలను తీసుకొచ్చింది. లేటెస్టుగా యూఐడీఐ (UIDI) కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. UIDAI ఆధార్‌ ఫేస్‌ అథంటికేషన్‌ RD పేరుతో కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా ఆధార్‌ కార్డుదారులు ఎక్కడి నుంచి అయినా ఫేస్‌ అథంటికేషన్‌ (Aadhaar Face Authentication)ను పూర్తి చేసుకోవచ్చు. మీ మొబైల్‌లో యాప్‌ ఉంటే చాలు.. ఫోన్‌ ద్వారా మీ ఫేస్‌ స్కానింగ్‌తో అథంటికేషన్‌ పూర్తి చేసుకోవచ్చు.

Uidai Launches Aadhaar Face Authentication Service App

Uidai Launches Aadhaar Face Authentication Service App

UIDAI నిర్ణయంతో చాలా మందికి ఆధార్ యూజర్లకు లబ్ది చేకూరనుంది. యూఐడీఏఐ ఆర్‌డీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఆధార్‌ యాప్‌ సర్వీస్‌ను జీవన్‌ ప్రమాణ్‌, PDS, స్కాలర్‌షిప్‌ స్కీమ్‌లు, కోవిడ్‌, ఫార్మర్‌ వెల్ఫేర్‌ స్కీమ్స్ వంటి ఉపయోగించుకోవచ్చని UIDAI ట్వీట్‌లో తెలిపింది. ఆధార్‌ కార్డుదారులు తమ ఆధార్‌ నెంబర్‌లు, ఇతర డెమొగ్రాఫిక్‌, బయోమెట్రిక్‌ డేటాను ఫేస్‌ అథంటికేసన్‌ కోసం సెంట్రల్‌ ఐడెంటిటీ డేటా రెపోజిటరీలో పొందవచ్చు.
ఆధార్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని UIDAI ఇన్‌హౌస్‌లో డెవలప్ చేసింది.

Aadhaar FaceRD యాప్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఆధార్ ధ్రువీకరణకు ఫేస్ క్యాప్చర్ చేస్తుందని UIDAI ట్వీట్‌లో తెలిపింది. మీ మొబైల్‌లో Google Play Store యాప్‌ ద్వారా Aadhaar FaceRD యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ఫేస్ ను అథెంటికేషన్ పూర్తి చేయడానికి వీలుంటుంది.

Read Also : PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!