Union Cabinet : మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది.

Farm Laws Repeal : మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టడమే మిగిలింది. 2021, నవంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుపై చర్చ జరిగింది. ది ఫార్మ్‌ లాస్‌ రిపీల్‌ బిల్లు-2021 తీర్మానానికి కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. చట్టాల రద్దుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తీర్మానం ప్రవేశపెట్టారు. కేబినెట్ సమావేశానికంటే ముందు…భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం భేటీ జరిగింది.

Read More : Chandrababu Naidu Issue : వైసీపీ ఎమ్మెల్యేలకు భద్రత పెంపు

మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ..గత కొన్ని రోజులుగా రైతన్నలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో రైతులు వినూత్నంగా నిరసనలు చేపట్టారు. కొన్ని సార్లు జరిగిన ఆందోళనలు హింసాత్మకంగ మారాయి. చలికి తట్టుకుంటూ..వానలకు తడుస్తూ..రైతులు జరిపిన పోరాటానికి మద్దతు పలికారు. కానీ..కేంద్ర ప్రభుత్వం మాత్రం చట్టాల రద్దుకు వెనుకడగు వేయలేదు. ప్రతిపక్షాలు ఈ అంశంపై నిలదీశాయి.

Read More : Kondapalli : హైకోర్టు తీర్పు మీదే ఆధారపడ్డ కొండపల్లి చైర్మన్ ఎన్నిక..!

అనూహ్యంగా నవంబర్ 19వ తేదీన జాతిని ఉద్దేశించి ప్రధాన మంత్రి మోదీ ప్రసంగించారు. వ్యవసాయ చట్టాల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై BKU ప్రతినిధి రాకేష్ టికాయత్ స్పందించారు. ప్రభుత్వం బిల్లు రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని, ఇంకా చాలా సమస్యలున్నాయని…వాటి పరిష్కారం తర్వాతే…ఉద్యమం ముగుస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే… వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్లు లోకసభ సచివాలయం ఓ బులెటిన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 29 నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజే లోక్ సభలో ది ఫార్మ్‌ లాస్‌ రిపీల్‌ బిల్లు-2021 ప్రవేశపెట్టనుంది కేంద్రం.

ట్రెండింగ్ వార్తలు