Video: నడిరోడ్డుపై రూ.50 వేలు పారేసుకున్న మహిళ.. క్షణాల వ్యవధిలో బైక్ ఆపి తీసుకుని, పరిగెత్తుకెళ్లిన యువకుడు
తల్లీకూతుళ్లు షాపింగ్ కోసం అక్కడకు వచ్చి రోడ్డు దాటుతుండగా.. తల్లి స్వెటర్ జాకెట్‌ను వేసుకునేందుకు దాన్ని విప్పే క్రమంలో అందులో ఉన్న రూ.50,000 నడిరోడ్డుపై పడిపోయాయి.
Video: పెళ్లి షాపింగ్ కోసం వెళ్లిన తల్లీకూతుళ్లకు ఒక షాకింగ్ ఘటన ఎదురైంది. తల్లి చేతిలో ఓ స్వెటర్ జాకెట్‌లో ఉన్న రూ.50,000 నడిరోడ్డుపై పడిపోయాయి. ఈ విషయాన్ని ఆ తల్లీకూతుళ్లు గమనించలేదు. ఆ తర్వాత క్షణాల వ్యవధిలోనే.. ఓ యువకుడు పరిగెత్తుకొచ్చి ఆ డబ్బు తీసుకుని, బైక్ ఎక్కి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని బార్కత్ నగర్ మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ మార్కెట్ ఎల్లప్పుడు రద్దీగా ఉంటుంది. తల్లీకూతుళ్లు షాపింగ్ కోసం అక్కడకు వచ్చి రోడ్డు దాటుతుండగా.. తల్లి స్వెటర్ జాకెట్‌ను వేసుకునేందుకు దాన్ని విప్పే క్రమంలో అందులో ఉన్న రూ.50,000 నడిరోడ్డుపై పడిపోయాయి.
అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఈ విషయాన్ని గుర్తించారు. డబ్బు కనిపించగానే వెంటనే బైక్‌ను ఆపి, తీసుకుని బైక్‌పైనే పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ కూతురికి, తల్లికి అక్కడ ఏం జరుగుతుందో మొదట అసలు అర్థం కాలేదు. ఆ తర్వాత వారు డబ్బు తీసుకుని బైక్‌పై పారిపోతున్నారని గ్రహించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ యువకులు పారిపోయారు.
సీసీటీవీని పరిశీలించిన పోలీసులు 48 గంటల్లో ఆ ఇద్దరు దొంగలను పట్టుకుని రూ.20,000 స్వాధీనం చేసుకున్నారు. వాళ్లు ప్రయాణించిన బైక్ కూడా ఒక రోజు ముందు దొంగిలించినదేనని పోలీసులు గుర్తించారు.
In Jaipur Bikers grab ₹50000 after women drop cash on road
byu/Big-Brilliant7984 inindiameme
