Video: పెళ్లి షాపింగ్ కోసం వెళ్లిన తల్లీకూతుళ్లకు ఒక షాకింగ్ ఘటన ఎదురైంది. తల్లి చేతిలో ఓ స్వెటర్ జాకెట్‌లో ఉన్న రూ.50,000 నడిరోడ్డుపై పడిపోయాయి. ఈ విషయాన్ని ఆ తల్లీకూతుళ్లు గమనించలేదు. ఆ తర్వాత క్షణాల వ్యవధిలోనే.. ఓ యువకుడు పరిగెత్తుకొచ్చి ఆ డబ్బు తీసుకుని, బైక్ ఎక్కి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని బార్కత్ నగర్ మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ మార్కెట్ ఎల్లప్పుడు రద్దీగా ఉంటుంది. తల్లీకూతుళ్లు షాపింగ్ కోసం అక్కడకు వచ్చి రోడ్డు దాటుతుండగా.. తల్లి స్వెటర్ జాకెట్‌ను వేసుకునేందుకు దాన్ని విప్పే క్రమంలో అందులో ఉన్న రూ.50,000 నడిరోడ్డుపై పడిపోయాయి.
అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఈ విషయాన్ని గుర్తించారు. డబ్బు కనిపించగానే వెంటనే బైక్‌ను ఆపి, తీసుకుని బైక్‌పైనే పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ కూతురికి, తల్లికి అక్కడ ఏం జరుగుతుందో మొదట అసలు అర్థం కాలేదు. ఆ తర్వాత వారు డబ్బు తీసుకుని బైక్‌పై పారిపోతున్నారని గ్రహించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ యువకులు పారిపోయారు.
సీసీటీవీని పరిశీలించిన పోలీసులు 48 గంటల్లో ఆ ఇద్దరు దొంగలను పట్టుకుని రూ.20,000 స్వాధీనం చేసుకున్నారు. వాళ్లు ప్రయాణించిన బైక్ కూడా ఒక రోజు ముందు దొంగిలించినదేనని పోలీసులు గుర్తించారు.
In Jaipur Bikers grab ₹50000 after women drop cash on road
byu/Big-Brilliant7984 inindiameme