కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా

అకాలీదళ్ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు. మిత్రపక్షమైన బీజేపీకి వ్యవసాయ రంగ బిల్లులకు ప్రారంభ మద్దతు ఇవ్వడంపై పంజాబ్‌లోని రైతుల నుంచి తమ పార్టీకి వ్యతిరేకత ఎదురైంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గానికి బాదల్ రాజీనామా చేశారు. క్యాబినెట్ సమావేశంలో బిల్లుకు మద్దతుదారుగా మంత్రి, లోక్ సభలో బిల్లులపై ఓటు వేయడానికి ముందే ఆమె రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు.

కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా

Union Minister Harsimrat Kaur Badal Quit from Cabinet : అకాలీదళ్ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు. మిత్రపక్షమైన బీజేపీకి వ్యవసాయ రంగ బిల్లులకు ప్రారంభ మద్దతు ఇవ్వడంపై పంజాబ్‌లోని రైతుల నుంచి తమ పార్టీకి వ్యతిరేకత ఎదురైంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గానికి బాదల్ రాజీనామా చేశారు. క్యాబినెట్ సమావేశంలో బిల్లుకు మద్దతుదారుగా మంత్రి, లోక్ సభలో బిల్లులపై ఓటు వేయడానికి ముందే ఆమె రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు.

బాదల్ భర్త, పార్టీ చీఫ్ Sukhbir Badal మాట్లాడుతూ.. అకాలీలు బయటి నుండి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉంటారని చెప్పారు. అయితే రైతు వ్యతిరేక విధానాలను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాలని శిరోమణి అకాలీదళ్‌ నిర్ణయించింది. రెండు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని అకాలీదళ్‌ స్పష్టం చేసింది.

హర్‌సిమ్రత్‌ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లి తన రాజీనామాను సమర్పించారు. లోక్‌సభలో ఈ బిల్లులపై ఓటింగ్‌కు కొద్ది గంటల ముందు హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా చేశారు. ఈ బిల్లులపై పంజాబ్‌, హరియాణా రైతాంగం గత కొన్నివారాలుగా ఆందోళనలు చేస్తోంది.