దెయ్యాన్ని వదిలిస్తానంటూ బాలింతను చచ్చేదాకా కొట్టాడు

దెయ్యాన్ని వదిలిస్తానంటూ బాలింతను చచ్చేదాకా కొట్టాడు

దెయ్యాన్ని వదిలిస్తానంటూ బాలింతను చచ్చేదాకా కొట్టాడు

హైదరాబాద్‌లో భూత వైద్యుడు దెయ్యం పోగొడతానంటూ మహిళను దారుణంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె సోమవారం రాత్రి తుది శ్వాస విడిచింది. నాలుగు నెలలుగా మహిళకు ఏ అనారోగ్యం లేదని సమాచారం. సంవత్సరన్నర క్రితం.. రజిత అనే యువతి మల్లేశ్ ను పెళ్లి చేసుకుంది. నాలుగు నెలల క్రితం ఓ పాపకు జన్మనిచ్చింది. మహిళకు ఈ మధ్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. దానికి కారణం ఆమెకేదో దెయ్యం పట్టిందని ఫ్యామిలీ అనుకుంది. రజిత తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె జైపూర్ లోనే భర్తతో కలిసి ఉంటుంది.

శ్యామ్ అనే భూత వైద్యుడు ట్రీట్మెంట్ ఇస్తానని నమ్మబలికి ఇంటికి పిలిపించాడు. రజిత జైపూర్ మండలంలో నివాసముంటుంది. గాయాలు ఎక్కువ కావడంతో ఆమెను కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అదే కారణంతో మహిళ సరిగా ఉండటం లేదు. భూత వైద్యుడు ఆమెను చెంపదెబ్బలు కొట్టడమే కాకుండా… జుట్టు పట్టుకులాగి.. మంచం మీదకు విసిరేసి ఆత్మలతో మాట్లాడుతున్నట్లు చేశాడు.

ఆ చేష్టలకు కుటుంబ సభ్యులంతా చూస్తూ ఉండిపోయారు. అదే పనిగా ఆమెను కొడుతూనే ఉన్నాడు శ్యామ్. క్రమంగా ఆమె ఓపిక సన్నగిల్లడంతో కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే ఆమె ప్రాణాలుకోల్పోయింది. మంగళవారం ఆమెకు పోస్టు మార్టం చేశారని పోలీసు అధికారులు తెలిపారు.

పోస్టుమార్టం చేయడం ద్వారా చనిపోయిన కారణం తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. ఘటనలో ఇన్వాల్వ్ అయినవారిపై కేసులు నమోదు చేశామని అధికారులు వెల్లడించారు.

×