Sania Mirza : నేను పూర్తి చేశాను.. సానియా మీర్జా ఇన్‌స్టా పోస్ట్‌.. విడాకుల అంశం మ‌రోసారి తెర‌పైకి..!

భారత మాజీ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్థాన్ స్టార్ ఆట‌గాడు షోయ‌బ్ మాలిక్‌ల విడాకుల అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.

Sania Mirza : నేను పూర్తి చేశాను.. సానియా మీర్జా ఇన్‌స్టా పోస్ట్‌.. విడాకుల అంశం మ‌రోసారి తెర‌పైకి..!

Sania Mirza - Shoaib Malik

Updated On : October 17, 2023 / 8:57 PM IST

Sania Mirza – Shoaib Malik : భారత మాజీ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్థాన్ స్టార్ ఆట‌గాడు షోయ‌బ్ మాలిక్‌ల విడాకుల అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. వీరిద్ద‌రు త్వ‌ర‌లోనే త‌మ వివాహ బంధానికి ముగింపు ప‌ల‌కనున్నార‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా సానియా మీర్జా త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చేసిన ఓ పోస్ట్ ఈ వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూరుస్తోంది. “నేను కమ్యూనికేట్ చేస్తుంటే, నేను శ్రద్ధ వహిస్తాను. నేను నిశ్శబ్దంగా ఉంటే, నేను పూర్తి చేసాను” అనే కోట్ సానియా మీర్జా పోస్ట్ చేసింది.

నివేదికల ప్రకారం.. 36 ఏళ్ల భారత టెన్నిస్ క్రీడాకారిణి తన కుమారుడు ఇజాన్‌తో కలిసి దుబాయ్‌లో నివసిస్తుండగా, మాలిక్ పాకిస్థాన్‌లో నివసిస్తున్నారు. అయితే.. విడాకుల వార్త‌ల‌పై ఈ ఇద్ద‌రు ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. పాకిస్తానీ నటి అయేషా ఉమర్‌తో మాలిక్‌ వివాహేతర సంబంధం కొన‌సాగిస్తుండ‌మే వీరిద్ద‌రి విడాకుల‌కు కార‌ణం అనే వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఈ వార్త‌ల‌ను అయేషా కొట్టిపారేసింది. అవ‌న్నీ రూమ‌ర్లు అని స్ప‌ష్టం చేసింది.

Olympic Games 2028 : ఒలింపిక్స్‌లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఆడ‌డం అసాధ్యం..? సూర్య‌కుమార్, పాండ్య‌లు క‌ష్ట‌మేనా..?

కాగా..షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2010లో హైదరాబాద్‌ వేదికగా వీరి వివాహం ఘనంగా జరిగింది. 2018లో వీరికి ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఉద‌య్‌పూర్ లో సానియా మీర్జా స్నేహితురాలు బాలీవుడ్ న‌టి ప‌రిణీతి చోప్రా వివాహం జ‌రిగింది. ఈ పెళ్లికి సానియా మీర్జా ఒక్క‌తే హాజ‌రు కావ‌డం ఆమె రిలేషన్షిప్ స్టేటస్ గురించి మరిన్ని ప్రశ్నలను లేవనెత్తింది. కాగా.. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి సానిమా మీర్జా రిటైరైన సంగ‌తి తెలిసిందే.

IND vs AUS : విశాఖ క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌.. చెబితే అస్స‌లు ఆగ‌రు!