వార్న్ వార్నింగ్ : IPLలో శాస్త్రి లేనప్పుడు పాంటింగ్ ఎందుకు?

వార్న్ వార్నింగ్ : IPLలో శాస్త్రి లేనప్పుడు పాంటింగ్ ఎందుకు?

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిని ఐపీఎల్‌లోకి తీసుకోనప్పుడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ మాత్రం ఆ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తాడని ప్రశ్నిస్తున్నాడు ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన షేన్ వార్న్ ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్‌పై ఆరోపణలు గుప్పించారు.

 

మరికొద్ది రోజుల్లో ఆరంభం కానున్న క్రికెట్ వరల్డ్ కప్ 2019కు ఆస్ట్రేలియా జట్టుకు సహాయ కోచ్‌గా పాంటింగ్‌ బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో ప్రపంచ ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గానూ పాంటింగ్ సేవలందించనున్నారు. 

 

ఇలా ఒకేసారి రెండు పదవుల్లోనూ ఎలా కొనసాగుతారనే ప్రశ్నను లేవనెత్తారు షేన్ వార్న్. 2015వ సంవత్సరంలో రవిశాస్త్రిని టీమిండియా హెడ్ కోచ్‌గా ఉంటూ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో కొనసాగకూడదంటూ ఆ పదవిని తొలగించింది బీసీసీఐ. మరి అలాంటప్పుడు పాంటింగ్ మాత్రం జాతీయ జట్టుకు సేవలందిస్తూనే ఐపీఎల్‌లో ఓ జట్టుకు ఎలా పనిచేస్తారని షేన్ వార్న్ ఆరోపిస్తున్నాడు. 

 

మరో పక్క రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇద్దరూ ఒకే జట్టులో ఆడుతూనే ఐపీఎల్‌లో రెండు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తుండటంపై.. వారిద్దరూ కెప్టెన్లుగా వ్యవహరించడమంటే ప్లేయర్లుగా ఉండటం వేరు పైగా అంతా ఒకే దేశం తరపున ఆడుతున్న వారంటూ వ్యాఖ్యానించాడు.