Tokyo 2021 : ఒలింపిక్స్ మెడల్స్ ఎలా తయారు చేశారో తెలుసా ?

ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. జపాన్ ప్రభుత్వం ఈ మెగా క్రీడల సంరంభాన్ని నిర్వహిస్తోంది. క్రీడా గ్రామాన్ని రూపొందించడం దగ్గరి నుంచి...పతకాల తయారీ వరకు వినూత్నంగా ప్రయత్నించింది. పతకాల విషయానికి వస్తే..ఆధునికత, సంప్రదాయాన్ని మాత్రం మరిచిపోలేదు.

Tokyo 2021 : ఒలింపిక్స్ మెడల్స్ ఎలా తయారు చేశారో తెలుసా ?

Tokyo

Olympic Medals : ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. జపాన్ ప్రభుత్వం ఈ మెగా క్రీడల సంరంభాన్ని నిర్వహిస్తోంది. ఈ ఒలింపిక్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఏర్పాట్లు..నిర్వాహణ…లో అక్కడి ప్రభుత్వం కొత్త కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తోంది. క్రీడా గ్రామాన్ని రూపొందించడం దగ్గరి నుంచి…పతకాల తయారీ వరకు వినూత్నంగా ప్రయత్నించింది. పతకాల విషయానికి వస్తే..ఆధునికత, సంప్రదాయాన్ని మాత్రం మరిచిపోలేదు.

Read More : Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

ఒలింపిక్స్ మెడల్స్ ను వినూత్నంగా తయారు చేసింది. ఇందుకు మూడేళ్ల క్రితమే ప్రణాళికలు రచించడం గమనార్హం. ఎలక్ట్రానిక్ చెత్తను ఓ మంచి పనికి ఉపయోగించాలని అక్కడి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఆ దేశానికి చెందిన పాత మొబైల్ ఫోన్లను సేకరించింది. అందులోని లోహ విడిభాగాలను వేరు చేసి వాటిని కరిగించి…మెడల్స్ తయారు చేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ పరిణామం. ఆధునాతన కంప్యూటర్ డిజైన్లతో అత్యంత అద్భుతంగా ఈ పతకాలను రూపొందించారు.

Read More : Ramoji Rao : కేటీఆర్‌కు రామోజీరావు లేఖ

ఇక ఒలింపిక్స్ మెడల్ ట్యాగ్ ల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంది. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన దారాలతో ఈ ట్యాగ్ లను తయారు చేయించింది. పతకాలను ఉంచేందుకు కలపతో ప్రత్యేక డబ్బాలను కూడా రూపొందించింది. పతకాలు గెలుచుకున్న వారు…ఎవరికి వారే మెడలో వేసుకోవాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, జపాన్ ప్రభుత్వం సూచించింది. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వెల్లడిస్తోంది.