Virat Kohli: విరాట్ చివరిగా సెంచరీ చేసిన సంగతి నాకైతే గుర్తు లేదు – సెహ్వాగ్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ టోర్నమెంట్ తో సహా మరే లీగ్‌లోనూ ఫామ్ కనబరచలేకపోయాడు. తనంతట తానే ఇది చాలా టఫ్ సీజన్ అని చెప్పుకున్న కోహ్లీ.. 2010 సీజన్ తర్వాత అత్యంత దారుణ ఫామ్ తో సతమతమవుతున్నాడు. చివరికి వరుసగా మూడు గోల్డెన్ డక్ ల చెత్త రికార్డు కూడా మూటగట్టుకున్నాడు.

Virat Kohli: విరాట్ చివరిగా సెంచరీ చేసిన సంగతి నాకైతే గుర్తు లేదు – సెహ్వాగ్

Virat Kohli

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ టోర్నమెంట్ తో సహా మరే లీగ్‌లోనూ ఫామ్ కనబరచలేకపోయాడు. తనంతట తానే ఇది చాలా టఫ్ సీజన్ అని చెప్పుకున్న కోహ్లీ.. 2010 సీజన్ తర్వాత అత్యంత దారుణ ఫామ్ తో సతమతమవుతున్నాడు. చివరికి వరుసగా మూడు గోల్డెన్ డక్ ల చెత్త రికార్డు కూడా మూటగట్టుకున్నాడు.

రెండేళ్లుగా కోహ్లీ కెరీర్‌లో ఒక్క ఇంటర్నేషనల్ సెంచరీ కూడా లేదు. ప్రత్యేకించి ఇంగ్లాండ్ లో జరిగిన మ్యాచ్ లలో కఠిన సవాల్ ఎదుర్కొన్నాడు. నవంబర్ 2019లో చివరిసారిగా ఇంటర్నేషనల్ సెంచరీ చేశాడు విరాట్. అతని ఫామ్ లేమి కారణంగా రవిశాస్త్రి లాంటి వాళ్లు కూడా బ్రేక్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

జూలై 1 నుండి ప్రారంభమయ్యే రీషెడ్యూల్డ్ టెస్ట్‌లో కోహ్లీ భారీ స్కోర్ చేయడానికి సపోర్ట్ ఇచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన వార్మప్ గేమ్‌లో అనుభవజ్ఞుడైన ఓపెనర్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను నొక్కి చెప్పాడు. ఐదో టెస్టులో అతను కోల్పోయిన ఫామ్ తిరిగి పొందగలడని అనుకుంటున్నట్లు అంచనా వేశాడు.

Read Also: సీజన్‌లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ

“కోహ్లీ చివరిసారి ఎప్పుడు సెంచరీ చేశాడో మీకు గుర్తుందా? నాకు కూడా గుర్తు లేదు. సిరీస్ డిసైడర్ అయిన ఈ ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఖచ్చితంగా పెద్ద స్కోర్ చేయాలని కోరుకుంటున్నా, ”అని వెల్లడించాడు సెహ్వాగ్.

“అతని చెడ్డ రోజులు ముగిసిపోయాయని అనుకుంటున్నా. ఇప్పుడు అతనికి మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నా. వార్మప్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ యాభై పరుగులు చేశాడు. 2వ ఇన్నింగ్స్‌లో ఫిఫ్టీ సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 33 పరుగులు చేశాడు” అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.