Updated On - 12:49 pm, Fri, 9 April 21
Shreyas Iyer: ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. భుజం గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే శ్రేయాస్ అయ్యర్ భుజానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్లో ఓ ఫోటో ద్వరా పంచుకున్నాడు శ్రేయాస్ అయ్యర్.
‘శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. త్వరలోనే మీ ముందుకొస్తాను. మీ ప్రార్థనలకు కృతజ్ఞతలు’ అంటూ శ్రేయస్ ట్వీట్ చేశాడు. శస్త్రచికిత్స తర్వాత నాలుగు నెలల పాటు అయ్యర్ క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. శ్రేయాస్ అయ్యర్ ఇటీవల ఇంగ్లాండ్ కౌంటీ జట్టు లాంకషైర్‌కు వన్డే టోర్నమెంట్ ఆడటానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లు జూలై 23న మొదలు కానుండగా.. ఈ టోర్నమెంట్లో అయ్యర్ పాల్గొనే అవకాశాలు కూడా లేవు.
ఇంగ్లండ్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో మిగిలిన వన్డే మ్యాచ్‌లకు కూడా శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. అయ్యర్ వీలైనంత త్వరగా కోలుకుని మైదానంలోకి తిరిగి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. శ్రేయస్ లేకపోవడంతో ఐపీఎల్‌లతో క్యాపిటల్స్‌కు రిషభ్ పంత్ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Surgery was a success and with lion-hearted determination, I’ll be back in no time 🦁 Thank you for your wishes 😊 pic.twitter.com/F9oJQcSLqH
— Shreyas Iyer (@ShreyasIyer15) April 8, 2021
IPL 2021-CSK vs KKR: చెన్నై చితక్కొట్టుడు.. దుమ్మురేపిన డుప్లెసిస్.. రెచ్చిపోయిన రుత్‌రాజ్
IPL 2021: PBKS vs SRH : హమ్మయ్యా హైదరాబాద్ గెలిచింది..
Punjab vs Hyderabad, 14th Match Preview- గెలిచేదెవరు? ఎవరి బలం ఏంటీ?
Rohit Sharma: అశ్విన్ బౌలింగ్‌లో హిట్ మ్యాన్ ఒంటి చేత్తో సిక్స్
IPL 2021- MI vs DC : మెరిసిన మిశ్రా.. ఢిల్లీ లక్ష్యం 138 పరుగులు
IPL 2021 MI Vs DC ముంబై వర్సెస్ ఢిల్లీ.. గెలుపెవరిది..?