T20 World Cup 2021: వాటే మ్యాచ్… పాకిస్తాన్‌‌పై సంచలన విజయంతో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

టీ20 వరల్డ్ కప్ సెకండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. పాకిస్తాన్ నిర్దేశించిన 177 పరుగుల టార్గెట్ ను

T20 World Cup 2021: వాటే మ్యాచ్… పాకిస్తాన్‌‌పై సంచలన విజయంతో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

T20 World Cup 2021 Australia Beats Pakistan

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ లో ఉత్కంఠభరితంగా సాగిన సెకండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా సంచలన విజయం నమోదు చేసింది. 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసి వరల్డ్ కప్ లో ఫైనల్ చేరింది. పాకిస్తాన్ నిర్దేశించిన 177 పరుగుల టార్గెట్ ను ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 49 పరుగులతో రాణించాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్ (31 బంతుల్లో 40 పరుగులు), వేడ్ (17 బంతుల్లో 41 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ సిక్సులతో చెలరేగారు. ముఖ్యంగా వేడ్ 4 సిక్సులు బాదాడు.

వీరిద్దరూ చెలరేగంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆసీస్ గెలిచింది. పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. షాహీన్ అఫ్రిదీ ఒక వికెట్ తీశాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరింది. ఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది.

T20 World Cup 2021: ధోనీ చెప్పినట్లుగా ఆడి జట్టును గెలిపించిన మిచెల్

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. ఓ దశలో చేతులెత్తేసినట్టే కనిపించింది. 96 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ.. మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా.. లక్ష్యాన్ని ముగించారు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన మాథ్యూ.. పాక్ కు విజయాన్ని దూరం చేశాడు. ఆసీస్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ ఫకార్ జమాన్ హాఫ్ సెంచరీలు చేశారు. రిజ్వాన్ 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. జమాన్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ బాబర్ అజామ్ 34 బంతుల్లో 39 పరుగులు చేశాడు. హార్డ్ హిట్టర్ ఆసిఫ్ అలీ డకౌట్ అయ్యాడు. కమిన్స్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

ICC T20I Rankings : 4 స్థానాలకు దిగజారిన కోహ్లి.. 5వ స్థానంలో కేఎల్ రాహుల్!

పాక్ ఓపెనర్లు ఆది నుంచి ఎదురుదాడికి దిగడంతో స్కోరు ఎక్కడా తగ్గలేదు. దానికితోడు ఆసీస్ ఆటగాళ్ల పేలవ ఫీల్డింగ్ కూడా పాక్ కు కలిసొచ్చింది. ఆసీస్ ఫీల్డర్లు పలు క్యాచ్ లు వదిలి పాక్ భారీ స్కోరుకు పరోక్షంగా సహకరించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2 వికెట్లు తీశాడు. కమిన్స్ , జంపా చెరో వికెట్ తీశారు.