ఆన్‌లైన్లో సక్సెస్ సీక్రెట్లు చెబుతున్న విరుష్కా జోడీ

  • Published By: Mahesh ,Published On : April 23, 2020 / 02:07 PM IST
ఆన్‌లైన్లో సక్సెస్ సీక్రెట్లు చెబుతున్న విరుష్కా జోడీ

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒక్క రోజులో టీచర్లు అయిపోయారు. లైవ్‌లో 50వేల మందికి క్లాస్ చెబుుతననారు. భారత లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ ఫాం అయిన Unacademyతో ముందుకొచ్చారు. అన్అకాడమీ సెకండ్ ఎడిషన్ ను ఇటీవలే లెజెండ్స్ ఆన్ అన్అకాడమీ పేరుతో ఓపెన్ చేశారు. గంటసేపు జరిగే ఈ సెషన్లో టాప్ క్రికెటర్, బాలీవుడ్ హీరోయిన్ కలిసి వారి ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా తాము ఇలాంటిది గతంలో చేయలేదని 50వేల అన్అకాడమీ లెర్నర్లు లైవ్ లో చూస్తుండగా చెప్పారు. వారు అనుభవాలను చెప్తూ కలలను సాకారం చేసుకోవడంలో ఎప్పుడూ నిరాశకు లోనై మధ్యలో ఆపేయలేదని చెప్పుకొచ్చారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వారి కెరీర్ ఆరంభం నుంచి చెప్పుకుంటూ మొదలుపెట్టారు. సంబంధం లేని విషయాల గురించి బాధపడకుండా వాటిని పక్కకుపెట్టి ముందుకుపోవాలని సూచించారు. 

విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఇతరులతో పోల్చుకోవడమనేది సంతోషాన్ని దొంగిలించడం లాంటిదని అన్నాడు. అనుష్క శర్మ గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ అవే ఫెయిల్యూర్ అంటే భయపడకుండా చేశాయని చెప్పింది. ఆ నిర్ణయాలు, ప్రయత్నాలు, శ్రమే ఈ రోజు ఇక్కడ నిలబెట్టాయని చెప్పారు. విరాట్ రాష్ట్ర స్థాయి జట్టులో ఎంపిక అవకపోవడాన్ని గుర్తు చేసుకున్నాడు.

ప్యాషన్, కమిట్‌మెంట్ ఉంటే చేయాలనే పట్టుదల అదే వస్తుంది. కొన్ని పరిస్థితులకు ఎదురు తిరగలేనప్పుడు ఇగోను చంపుకోవాలి. నీదైన శైలిలో పోరాడుతూనే ఉండాలి. ఈ ఇన్‌స్పైరింగ్ సందేహాలు-సమాధానాలతో పూర్తి అయింది. అనుష్క శర్మ ఫిట్‌నెస్, విరాట్ తొలి రోజుల్లో అలవాట్లు గురించి అడిగిన ప్రశ్నలకు నిజాయతీగా సమాధానాలిస్తూ.. లెర్నర్లను ఇన్‌స్పైర్ చేశారు.