Virat Kohli: ఫ్యాన్‌ను తిట్టిపోసిన విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ కోపాన్ని రుచి చూపేలా చేసింది ఈ ఘటన. లీసెస్టర్‌షైర్ వేదికగా జరిగిన వార్మప్ నాలుగు రోజుల మ్యాచ్ లో తన జట్టు ప్లేయర్ అయిన కమలేశ్ నాగర్ కోటికి సపోర్ట్ చేస్తూ ఓ ఫ్యాన్ ను తిట్టిపోశాడు.

Virat Kohli: ఫ్యాన్‌ను తిట్టిపోసిన విరాట్ కోహ్లీ
ad

Virat Kohli: వివాదాలతో విరాట్ కోహ్లీ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాడు. ఫీల్డ్ లో ఉన్నా.. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నా అగ్రెసివ్‌నెస్ తగ్గు. ఇటీవల జరిగిన ఓ ఘటన మరోసారి అభిమానులకు అతని కోపాన్ని చూపించేలా చేసింది. లీసెస్టర్‌షైర్ వేదికగా జరిగిన వార్మప్ నాలుగు రోజుల మ్యాచ్ లో తన జట్టు ప్లేయర్ అయిన కమలేశ్ నాగర్ కోటికి సపోర్ట్ చేస్తూ ఓ ఫ్యాన్ ను తిట్టిపోశాడు.

వార్మప్ మ్యాచ్ రెండో రోజులో భాగంగా… మైదానంలో నాగర్‌కోటి ఫీల్డింగ్ చేస్తుండగా ఓ అభిమాని తనతో ఫొటో దిగాలని రిపీటెడ్‌గా అడుగుతూ ఉన్నాడు. బౌండరీ రోప్ దగ్గర ఆడుతున్న అతణ్ని అభిమాని ఇబ్బంది పెడుతున్నట్లుగా భావించిన కోహ్లీ.. బాల్కనీ డ్రెస్సింగ్ రూం నుంచి రెస్పాండ్ అయ్యాడు.

వైరల్‌గా మారిన వీడియోలో ఈ మాజీ కెప్టెన్.. టీమ్ మేట్‌ను డిఫెండ్ చేస్తూ కనిపించాడు.

నాగర్‌కోటి రెగ్యూలర్ ప్లేయర్ ఇండియా టెస్ట్ టీంలో లేకపోయినా.. నెట్ బౌలర్‌గా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాడు.

Read Also: సీజన్‌లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ

జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో ఐదో, చివరి టెస్టు మ్యాచ్ కోసం భారత్ సర్వం సిద్ధం చేసింది. 3 వన్డేలు, 3 టీ20లు కూడా ఆడనున్నారు. దీనికి ముందు, జూన్ 26, జూన్ 28 న ఐర్లాండ్‌తో భారత్ 2 మ్యాచ్‌ల T20I సిరీస్‌ను కూడా ఆడనుంది.


 

పూర్తి బృందం:
ఐర్లాండ్ T20I సిరీస్ కోసం భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, దినేశ్ కార్తీక్ (wk), ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ , రవి బిష్ణోయ్.

ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ , చెతేశ్వర్ పుజారా , విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్), రవీంద్ర జడేజా , రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా , మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ , ప్రసిద్ధ్ కృష్ణ, శ్రీకర్ భరత్ (wk)

ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలు మరియు టీ20లకు భారత జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛెతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్), కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ థాక్ అశ్విన్ , మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.