Home » 10TV Agri
ఇటీవల కాలంలో జామపండ్లకు విపరీతమైన గిరాకీ పెరగడం.. అందుకు అనుగుణంగానే హైబ్రీడ్ రకాలు రావడం.. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి అధిక దిగబడిని తీసే పద్ధతులు రావడంతో రైతులకు లాభాల పంటగా మారిపోయింది.
పాల పుట్టగొడుగుల పెంపక కాలం 60 రోజులు. 35 రోజుల దాటిన తర్వాత దిగుబడి ప్రారంభమవుతుంది. 3 నుంచి 4 దఫాలుగా గొడుగులను, బెడ్లనుంచి మెలితిప్పి కోయాల్సి వుంటుంది. సాధారణంగా కిలో పుట్టగొడుగుల విత్తనం 5 నుంచి 6 బెడ్లకు సరిపోతుంది.
ఎకరంలో కొద్ది పాటి విస్తీర్ణంలో స్థానికంగా దొరికే కర్రలతో పందిర్లను ఏర్పాటు చేసి బీర, కాకర సాగుచేస్తుండగా.. ఆ పందిళ్లకింద అంతర పంటగా పొదచిక్కుడు, బంతి, వంగ, సొర, దోస సాగుచేస్తున్నారు.
కొబ్బరి, కోకోలతో పాటు అంతర పంటగా ఇప్పుడు వక్కసాగును రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండలం, సూర్యచంద్రరావు గ్రామానికి చెందిన రైతు బలుసు వీరభద్రారావు కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగుచేసేందుకు సిద్దమయ్యారు.
చీమ మిర్చి కాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వీటి కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ దేశీ రకం మొక్కకి పుంఖాను పుంఖాలుగా కాపు కాస్తుంది. మిరపకాయలు ఆకుపచ్చ, లేత గోధుమ, పసుపు, ఎరుపు రంగులో ఉంటాయి. పొట్టిగా ఉండే ఈ మిరపను బర్డ్ ఐ చిల్లి అని కూడా అంటారు.
ఈ ఏడాది మిల్లెట్స్ సాగుకు పెద్ద పీఠ వేశాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో పలు మండలాల్లో ఈ మిల్లెట్స్ సాగును ప్రారంభించారు. జిల్లాలో 2007 నుంచి పనిచేస్తోన్న సబల అనే స్వచ్చంద సంస్థ... జిల్లాలో ప్రక్రతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వ�
పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడం పైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు నూటికి 90శాతంమంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు.
వర్షాకాలంలో క్యాబేజి సాగంటే రైతుకు రిస్కుతో కూడుకున్నపని. ఎందుకంటే ఈ పంటల సాగుచేసే భూముల్లో నీరు నిల్వ వుండకూడదు. ఏ మాత్రం నీరు నిల్వ వున్న వేరుకుళ్లు తెగులు ఉధృతి వల్ల మొక్కలు చనిపోయే అవకాశం వుంది.